dead mother
-
తల్లి మృతదేహంతో 18 రోజులు!
కోల్‌కతా: తల్లి మృతదేహాన్ని ఖననం చేయడానికి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న కొడుకు ఆ శవంతోనే ఒంటరిగా 18 రోజులు గడిపిన ఘటన కోల్‌కతాలో తాజాగా వెలుగుచూసింది. వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అసలు విషయం వెలుగుచూసింది. ఆదివారం పోలీసులు సాల్ట్‌లేక్‌లోని ఆ ఇంటి తలుపులు బద్ధలు కొట్టేసరికి 30 ఏళ్ల మైత్రేయ భట్టాచార్య.. తన తల్లి క్రిష్ణ భట్టాచార్యా(77) మృతదేహం పక్కన కూర్చుని ఉన్నాడు. వారం క్రితమే తన తల్లి చనిపోయిందని చెబుతున్నా మృతదేహం కుళ్లిన స్థితిని బట్టి చూస్తే ఆమె మృతిచెంది 18 రోజులు పూర్తయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మైత్రేయను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తాము క్రైస్తవ మతంలోకి మారామని, తమ మత ఆచారాల ప్రకారం మృతదేహాన్ని 21 రోజుల తరువాతే ఖననం చేయాలని అందుకే వేచిచూస్తున్నానని మైత్రేయ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఎంసీఏని మధ్యలేనే మానేసిన మైత్రేయ నిరుద్యోగి కాగా, ఆయన తల్లి టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. వైద్యుడిగా పనిచేసిన మైత్రేయ తండ్రి 2013లో ఒంటికి నిప్పు అంటుకుని అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. తండ్రి పింఛన్ డబ్బులతోనే ప్రస్తుతం తల్లికొడుకులు కుటుంబం వెళ్లదీస్తున్నారు. -
చనిపోయిన తల్లిని నిద్రలేపేందుకు....
-
చనిపోయిన తల్లికి పుట్టిన మృత్యుంజయురాలు
ఆకాశం నుంచి పడిన ఓ ఇజ్రాయిలీ బాంబు తల్లిని కడతేర్చింది. మరి కొన్ని బాంబులు ఆమె ఇంటిని తునాతునకలు చేశాయి. ధ్వంసమైన ఇంటి భగ్నశకలాల మధ్య పడున్న ఆ తల్లి కడుపులో ఓ బిడ్డ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంది. బలహీనంగానైనా ఊపిరి తీసుకుంటూ 'బతుకుతాను' అంటోంది. ఇజ్రాయిల్ పాలెస్తీనియన్ల భీకర పోరులో, బాంబుల వర్షం, బారు ఫిరంగుల మోతలో శవమైన తల్లి కడుపులో ఉన్న ఆ బిడ్డను బయటకు తీసేందుకు డాక్టర్లు గడియారం ముల్లుతో పోటీ పడుతూ ప్రయత్నించారు. మామూలుగా తల్లి చనిపోయిన అయిదు నిమిషాలకే కడుపులో బిడ్డ కూడా చనిపోతుంది. కానీ షర్నా అనే 23 ఏళ్ల ఆ తల్లి గాజా లోని డేర్ అల్ బలాహ్ ఆస్పత్రికి రావడానికి ముందే చనిపోయింది. అప్పటికే పదినిముషాలైంది. అయినా డాక్టర్లు ఆశ వదల్లేదు. సిజేరియన్ చేసి మరీ పాపను బయటకి తీశారు. పాప ఊపిరి తీసుకుంటోంది. గుండె బలహీనంగానైనా కొట్టుకుంటోంది. "నిజంగా ఇదొక అద్భుతం. ఇప్పటికీ ఆ పాప బతుకుతుందా అన్నది చెప్పలేం. ఛాన్సులు ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాయి" అన్నారు ఆమెను బయటకు తీసిన డాక్టర్ ఫాదీ అల్ ఖ్రోటే. "ఆ పాప బతుకుతుందనే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ పాప పాలెస్తీనియన్. పాలెస్తీనియన్లది నిత్యం బతుకు పోరాటమే" అన్నారాయన. చావు మధ్య చావు నుంచి పుట్టిన ఆ పాప చిరంజీవి కాకపోతే ఇంకెవరు చిరంజీవి అవుతారు? -
సైనిక దాడిలో గర్భిణి మృతి.. శిశువును కాపాడిన వైద్యులు
గాజా: ఇజ్రాయెల్ దాడుల్లో గాజా నగరం శిథిలాల దిబ్బగా మారుతోంది. తాజా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కనీసం 85 మంది పాలస్తీనీయుల మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దళాలకు, పాలస్తీనాలోని హమాస్ వర్గానికి మధ్య జరుగుతున్న పోరులో దాదాపు 1000 మంది చనిపోయారు. గాజా నగరంలో ఎటు చూసినా హృదయ విదారక సంఘటనలే. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 23 ఏళ్ల గర్భిణి మరణించింది. ఇంటి శిథిలాల కింద పడిఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి మహిళ గర్భంలో ఉన్న శిశువును రక్షించారు.