ట్రివియా
మన శరీరంలోని అతిపెద్ద గ్రంథి, ఇది పోషకాల ఖజానా. మనం తినే ఆహారంలోని విటమిన్లు, ఐరన్ సహా ఖనిజ లవణాలను నిల్వ ఉంచుకుని, నిరంతరం శరీరానికి సరఫరా చేస్తుంది. శరవేగమైన ప్రాసెసర్ గల సూపర్ కంప్యూటర్ స్థాయిలో పనిచేసే అవయవం లివర్ మాత్రమే. మెదడుకు గ్లూకోజ్ సరఫరా చేయడం, ఇన్ఫెక్షన్లతో పోరాడటం, పోషకాలను నిల్వ చేసుకోవడం వంటి దాదాపు రెండువందల పనులను ఏకకాలంలో చేస్తుంది. లివర్ పదిశాతం కొవ్వుతో తయారై ఉంటుంది. లివర్‌లో కొవ్వు అంతకు మించిన పరిస్థితినే ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఫ్యాటీ లివర్ పరిస్థితి ఏర్పడితే టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.
శరీరంలోని మాలిన్యాలను, విషపదార్థాలను లివర్ ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. ఆల్కహాల్, ఇతర మాదక పదార్థాల వల్ల శరీరానికి కలిగే అనర్థాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.మన శరీరంలో ప్రవహించే రక్తంలో పది శాతం లివర్‌లోనే ఉంటుంది.మన శరీరంలో తిరిగి పెరిగే సామర్థ్యం ఉన్న ఏకైక అవయవం లివర్ మాత్రమే. ఒకవేళ సగానికి పైగా దెబ్బతిన్నా, ఇది పూర్తిగా పెరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అందుకే అవసరంలో ఉన్న ఇతరులకు లివర్‌లో కొంత భాగాన్ని దానం చేసినా, ఎలాంటి ఇబ్బంది ఉండదు.యంత్రాలలో బ్యాటరీ పనిచేసినట్లే, మన శరీరంలోని లివర్ పనితీరు ఉంటుంది. ఇది చక్కెరను నిల్వ చేసుకుని, శరీర అవసరాలకు అనుగుణంగా విడుదల చేస్తూ ఉంటుంది. లివర్ ఈ పని సమర్థంగా చేయకుంటే, రక్తంలో చక్కెర స్థాయి గణనీయంగా పడిపోయి, కోమాలకు చేరుకునే ప్రమాదం ఏర్పడుతుంది.
లివర్... సెంటర్ ఫర్ పవర్
Published Sun, May 17 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM
Advertisement