
పసికందుతో మహిళా కానిస్టేబుల్ అర్చన (ఫైల్)
బనశంకరి : ఈనెల 1న ఇక్కడి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని లభించిన అనాథ శిశువు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఇందిరా గాంధీ చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎలక్ట్రానిక్ పోలీసులు తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ నిర్మాణ భవనం వద్ద 20 రోజుల క్రితం శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ చిన్నారికి మహిళా కానిస్టేబుల్ అర్చన దగ్గరకు తీసుకుని పాలు పట్టారు.
అనంతరం చిన్నారిని విల్సన్ గార్డెన్‌లోని శిశు విహార్‌కు అప్పగించారు. అక్కడ మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పసిందును జయనగర్‌లోని ఇందిరా గాంధీ చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో చిన్నారి ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ అర్చన కన్నీరు మున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment