orphan childs
-
AP: కోవిడ్ అనాథలకు అండగా ప్రభుత్వం
కడప సిటీ: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు మృతి చెందటంతో అనాథలుగా మిగిలిన పిల్లల భవిష్యత్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించి కొండంత అండగా నిలుస్తోందని వైఎస్సార్ జిల్లా కలెక్టర్ వి.విజయరామరాజు అన్నారు. జిల్లాలో కరోనా వల్ల తల్లిదండ్రులు మృతి చెందగా.. అనాథలైన మూడు కుటుంబాల్లోని నలుగురు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేసిందని ఆయన తెలిపారు. ఆ మొత్తాలను ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన బాండ్లను సంబంధిత చిన్నారులకు కలెక్టర్ తన చాంబర్లో శుక్రవారం అందజేశారు. బాండ్లను అందుకున్న వారిలో అట్లూరు మండలం ముతుకూరుకు చెందిన అరవ రామిరెడ్డి, రమాదేవి పిల్లలు మని (14), వెంకట శ్రీనాథ్‌రెడ్డి (16), ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లెకు చెందిన షేక్ సయ్యద్, మహబూబ్‌బీ కుమార్తె కమాల్‌బీ (16), బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లెకు చెందిన జి.ప్రకాశం, ఫాతిమా దంపతుల కుమార్తె గొల్లపల్లె భవాని (17) ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోవిడ్ కారణంతో తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరు లేదా ఇద్దరూ మరణిస్తే.. 18 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తోందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్ బీమా, ఇతర బీమాలతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందుతుందని తెలిపారు. సహాయం అందుకున్న వారంతా బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి మంచి పేరు తెచ్చుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. -
కోవిడ్ వల్ల అనాథలుగా 577 మంది బాలలు
న్యూఢిల్లీ: కోవిడ్ మరణాల వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలు 577 మంది ఉన్నట్లు రాష్ట్రాలు వెల్లడించాయని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పారు. ఈ పిల్లలందరనీ వారి దగ్గర బంధువుల వద్దే ఉంచి, జిల్లా కలెక్టర్ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. వీరి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం వహించడం లేదని, సంక్షేమం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రాలు, జిల్లాల స్థాయిలో పిల్లల గురించి వివరాలు కనుక్కుంటున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. మహిళా శిశుసంక్షేమ శాఖ సహా ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ సైతం వీరికి తోడ్పాటును అందిస్తున్నాయని వెల్లడించాయి. (చదవండి: ఆస్పత్రిలో చేరిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి) -
అమ్మా.. నాన్న ఎక్కడ?
సాక్షి, కామవరపుకోట(పశ్చిమగోదావరి) : కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఆ చిన్నారుల్ని వదిలేసి ఎటో వెళ్లిపోయింది. తండ్రి మద్యానికి బానిసై పిల్లల్ని రోడ్డున పడేశాడు. దీంతో అమ్మా నాన్న ఉన్నప్పటికీ అభం శుభం తెలియని ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. కామవరపుకోట మండలం 93 రామన్నపాలెం గ్రామంలో తల్లిదండ్రులుండి అనాథలుగా మారిన ఆ ఇద్దరు చిన్నారుల్ని పోలీసులు చేరదీశారు. గ్రామ డ్వాక్రా మహిళల ద్వారా సమాచారం తెలుసుకున్న తడికలపూడి ఎస్సై సతీష్‌కుమార్ గ్రామానికి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆ పిల్లల్ని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వ బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఎస్సై సతీష్‌కుమార్ తెలిపిన సమాచారం ప్రకారం.. రామన్నపాలెం గ్రామానికి చెందిన ఆడమిల్లి అర్జునరావు, అతని భార్య మరియమ్మలు కుటుంబ కలహాలతో విడిపోయారు. పాప నాగదుర్గ(4), బాబు చిన్ను(3)లను వదిలేసి తల్లి ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. తండ్రి కూడా ఇంటికి రాకుండా ఆ పిల్లల్ని అనాథలుగా వదిలేశాడు. దీంతో పోలీసులు చొరవ తీసుకుని వారిని బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు. -
అమ్మానాన్నలు దొరికారోచ్..
కన్నవారు పేగు బంధాన్నితెంచుకుంటే.. మనసున్న వారు ఆ బంధాన్ని అపురూపంగా అందుకున్నారు.కర్కశంగా వదిలి వెళ్లిన ఆ చిన్నారులకు అన్నీ తామవుతామని ముందుకు వచ్చారు. వారు అనాథలు కాదని ఇక నుంచి అందరూ ఉన్న వారంటూ ఆప్యాయంగా వారిని ఒడిలో చేర్చుకున్నారు. ఇప్పటి వరకు శిశుగృహ సంరక్షణలో ఉన్న వారికి నేడు ‘అమ్మానాన్నలు దొరికారు’. తూర్పుగోదావరి , కాకినాడ సిటీ: కాకినాడ శిశుగృహ సంరక్షణలో ఉన్న ఆడ శిశువులను కారా నిబంధనలకనుగుణంగా దత్తత స్వీకరణకు దరఖాస్తు చేసుకున్న దంపతులకు మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా అప్పగించారు. 2017 జూన్ 12న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎన్ఐసీయూలో వదిలివెళ్లిన ఆడశిశువును చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు కాకినాడలోని శిశు గృహం సంరక్షణలో చేర్పించారు. ఈ శిశువు కోసం బయోలాజికల్ తల్లిదండ్రులు తగిన ధ్రువీకరణలతో క్లెయిమ్ చేయాలని పత్రికా ముఖంగా ప్రకటన జారీ చేయగా ఎవరి నుంచి క్లెయిమ్ దాఖలు కాకపోవడంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈ బాలికకు అరుణ పేరున నామకరణం చేసి 2017 సెప్టెంబర్ 1న చట్టప్రకారం దత్తత అప్పగించేందుకు బాలిక వివరాలను కారా వెబ్సైట్లో ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, గ్రాండ్ ఫోర్క్స్ ఏఎఫ్‌బీ నార్త్ డకోటా నివాసులైన జాషువా ఓబోల్జ్, ఎమి ఓబోల్జ్ దంపతులు అరుణను దత్తత స్వీకరించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అర్హతలను పరిశీలించి న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఒక సంవత్సరం 9 నెలలు వయస్సు కలిగిన బాలిక అరుణను చట్టప్రకారం మంగళవారం ఓబోల్జ్ దంపతులకు దత్తత అప్పగించారు. దత్తత తల్లిదండ్రులు తమ బిడ్డకు లిడియా అరుణ ఓబోల్జ్గా పేరు పెట్టుకున్నారు. చెన్నై నివాసులకు.. 2018 సెప్టెంబర్ 30న ముమ్మిడివరం ప్రకాష్ కాంప్లెక్స్ సమీపంలోని విష్ణాలయం వద్ద 15 రోజుల వయస్సు కలిగిన ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు విడిచి వెళ్లారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు ఈ శిశువుకు సంజన అని నామకరణం చేసి కాకినాడ శిశుగృహం సంరక్షణలో ఉంచారు. బయోలాజికల్ తల్లిదండ్రులు తగిన ధ్రువీకరణలతో క్లెయిమ్ చేయాలని పత్రికా ముఖంగా కోరినా ఎవరూ రాలేదు. దీంతో డిసెంబర్ 7, 2018న చట్టబద్ధమైన దత్తత అప్పగించేందుకు కారా వెబ్సైట్లో సంజన వివరాలు ప్రకటించారు. దీంతో దత్తత స్వీకరణకు చట్టపరమైన అన్ని అర్హతలు పూర్తి చేసి తమిళనాడు, చెన్నై నివాసులు జి నటరాజు, విష్ణుప్రియ దంపతులకు సంజనను దత్తత అప్పగించారు. ఈ బిడ్డలను దత్తత చేపట్టిన దంపతులను కలెక్టర్ కార్తికేయ మిశ్రా అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్–2 సీహెచ్ సత్తిబాబు, ఐసీడీఎస్ పీడీ సుఖజీవన్‌బాబు, ఏపీడీ పి.మణెమ్మ, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సిహెచ్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
అనాథ శిశువు అయ్యింది అమెరికా అమ్మాయి
శివాజీనగర(కర్ణాటక): ఏడాది కిందట చెత్తకుప్పలో అనాథ శిశువుగా దొరికిన అన్విత తొలి పుట్టినరోజు వేడుకలు శనివారం హాసన్‌లోని తవరు చారిటబుల్ ట్రస్ట్‌లో ఘనంగా జరిగాయి. విదేశాల నుంచి వచ్చిన దంపతులు ఈ శిశువును దత్తత తీసుకున్నారు. ఒక ఆడశిశువును హొళె నరసిపురలో కుప్పతొట్టిలో పడేసి వెళ్లిపోవడంతో చీమలు, ఉడుతలు కరవడంతో పసిగుడ్డు రోదిస్తుండగా, స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. తరువాత హాసన్ జిల్లా ఆసుపత్రికి చేర్చగా వైద్యుల చికిత్సలో ప్రాణాలతో బయటపడింది. త్వరలో అమెరికాకు హాసన్‌లో డాక్టర్ పాలాక్షప్ప నేతృత్వంలోని తవరు చారిటబల్ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందిన అన్వితా శనివారం తొలి పుట్టిన రోజును జరుపుకుంది. కలెక్టర్ రోహిణి సింధూరి ప్రత్యేకంగా పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ఈసందర్భంగా అమెరికాకు చెందిన రెండు జంటలు ఇందులో పాల్గొన్నాయి. అన్వితతో పాటు మరొక చిన్నారిని వారు దత్తత తీసుకున్నారు. దీంతో అనాథ శిశువు అమెరికా అమ్మాయి అయ్యిందని పలువురు ఆనందం వ్యక్తంచేశారు. వీసా తదితరాలు కొన్ని రోజుల్లో పూర్తిచేసుకుని అన్వితను అమెరికాకు తీసుకెళ్తామని అమెరికన్ దంపతులు తెలిపారు. -
ఆ అనాథ శిశువు ఇక లేదు
బనశంకరి : ఈనెల 1న ఇక్కడి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని లభించిన అనాథ శిశువు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఇందిరా గాంధీ చిన్నపిల్లల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎలక్ట్రానిక్ పోలీసులు తెలిపారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ నిర్మాణ భవనం వద్ద 20 రోజుల క్రితం శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ చిన్నారికి మహిళా కానిస్టేబుల్ అర్చన దగ్గరకు తీసుకుని పాలు పట్టారు. అనంతరం చిన్నారిని విల్సన్ గార్డెన్‌లోని శిశు విహార్‌కు అప్పగించారు. అక్కడ మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పసిందును జయనగర్‌లోని ఇందిరా గాంధీ చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో చిన్నారి ఆదివారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ అర్చన కన్నీరు మున్నీరుగా విలపించారు. -
శిశుగృహ.. పాపాలపుట్ట
శ్రీజ..ఈ చిన్నారి శిశుగృహలో గత ఏడాది ఆగస్టు 24న చేరింది. అప్పుడు ఆమె బరువు 2.9 కేజీలు..అదే నెల ఆస్పత్రిలో చేర్పించినప్పుడు 2.580 కేజీలు. అంటే 32 గ్రాములు తగ్గింది. ఈ చిన్నారి అదే ఏడాది అక్టోబర్ 21న చనిపోయింది. మిగతా చిన్నారులందరూ శిశుగృహలో చేరినప్పుడు బరువు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత పోషకాహారలోపంతోనే బరువు తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. సాక్షి, నల్లగొండ : అనాథ శిశువులను అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించాల్సిన శిశుగృహ.. పాపాల పుట్టను తలపిస్తోంది. ముక్కుపచ్చలారని పసిమొగ్గలను పొట్టనపెట్టుకుంది. ‘పౌష్టికాహార లోపమే’ అన్న కఠోర వాస్తవాలను బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా మాయమాటలతో కప్పేస్తున్నారు. పాపపుణ్యాలు ఎరుగని 14 మంది చిన్నారులు మృతిచెందడానికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలిసినప్పటికీ ఉన్నతాధికారులు నోరుమెదపడం లేదు. చనిపోయిన పిల్లలు బరువు తక్కువ ఉన్నారని, అప్పుడే పుట్టిన పిల్లలకు ముర్రుపాలు పట్టించకుండా శిశుగృహలో వదిలేస్తున్నారని విషపు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి శిశుగృహలో చేర్పిస్తున్న పిల్లల బరువు రికార్డుల్లోకి ఎక్కించిన తర్వాతే వారి సంరక్షణ చర్యలు చేపడుతారు. ఈ విధంగా చనిపోయిన 14 మంది పిల్లల బరువు శిశుగృహలో చేర్పించేనాటికే రెండు కేజీలు పైబడి ఉన్నారు. ఒకరిద్దరు మినహా పిల్లలందరూ రెండు కేజీలు దాటి ఉన్నారు. అయితే కొన్నేళ్లుగా చోటుచేసుకోని వరుస మరణాలు ఆకస్మికంగా ఎందుకు జరిగాయా అనే కోణంలో ఆరాతీస్తే మాత్రం పౌష్టికాహార లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్నేళ్లుగా అపోలో ఫార్మా నుంచి సరఫరా అవుతున్న జీరోలాక్ట్, లాక్టోజన్ వంటి పాల డబ్బాలను వినియోగించిన అధికారులు ఉన్నపళంగా బంద్ చేశారు. ఆరు మాసాలు దాటిన పిల్లలకు వాడే సుప్రబాత్ టెట్రాపాల ప్యాకెట్లను ప్రయోగించారు. దీంతో శిశువుల ఆరోగ్యం క్షీణించి బరువు కోల్పోయారు. పిల్లలకు టెట్రాపాలు వాడాలని అధికారులే లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. వైద్యుల సలహాలను పాటించకపోవడం, తరచూ వైద్యులను మార్చడం, పిల్లలు చనిపోతున్న విషయాన్ని ఉన్నతాధికారుల వరకు వెళ్లనివ్వకుండా ఏకపక్ష నిర్ణయాలతో పిల్లల ప్రాణాలు తీశారు. మరణాలకు సంబంధించి అధికారులు చేస్తున్న ప్రచారానికి, శిశుగృహలో పిల్లలను చేర్పించేనాటికి రికార్డుల్లో నమోదైన 11మంది పిల్లల బరువు వివరాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. పౌష్టికాహారం నిలిపేసి, టెట్రాపాలు పట్టించడంతో అనారోగ్యానికి గురైన పిల్లలను వివిధ ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. అప్పటికే ఆరోగ్యం క్షీణించి బరువు కోల్పోయిన చిన్నారులు రోజుల తరబడి ఆస్పత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడి చివరకు మృత్యుఒడిలో చేరారు. -
పాపం.. అనాథలవుతున్నారు!
పుత్తూరు: కుటుంబసమస్యలో.. పోషించే స్తోమత లేదో గానీ అభం శు భం తెలియని పసిగుడ్డులను కన్న తల్లిదండ్రులు రోడ్డుపై వదిలేస్తున్నా రు. ఫలితంగా వారు అనాథలవుతున్నారు. గత నెల 30వ తేదీ దిగువగూళూరు వద్ద పసిపాపను ముళ్లపొదల పాలు చేసిన సంఘటన మరచిపోక ముందే మరో ఆడబిడ్డ అనా థ అయ్యింది. ఐసీడీఎస్ సీడీపీఓ పద్మజారెడ్డి కథనం మేరకు... స్థాని క తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం సుమారు ఏడాదిన్నర వయసు ఉన్న ఆడబిడ్డ ను వదిలేసి వెళ్లిపోయారు. కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చిన స్థానికులు పాప ఒంటరిగా ఉండ డం గమనించి, తల్లిదండ్రుల కోసం ఆరా తీశారు. అయినా ఫలి తం లేకపోవడంతో స్థానికులు పు త్తూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ హనుమంత ప్ప ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చి సీడీపకో పద్మజారెడ్డికి పాపను అప్పగించారు. పాపను ఆ రోగ్య పరీక్షల నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆ రోగ్య పరిస్థితి బాగుంటే శిశువి హార్‌కు తరలిస్తామని సీడీపీఓ తెలిపారు. -
అనాథలు, మానసిక వికలాంగులకు పోటీలు
న్యూశాయంపేట : జ్యోతిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ బాలలు, మా నసిక వికలాంగులకు సాంస్కృతిక, ప్రతిభా పాటవ పోటీలను నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షుడు దూదిపాల జ్యోతిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 27, 28, 29వ తేదీల్లో బాలసముద్రంలోని మల్లికాంబ మనోవి కాస కేంద్రంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు శుక్రవారంలోగా పేర్లను మల్లికాంబలో సమర్పించాలన్నారు. వివరాలకు 99481 30367, 99661 59848 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.