తల్లిదండ్రులు వదిలివేసిన పసిపాప
పుత్తూరు: కుటుంబసమస్యలో.. పోషించే స్తోమత లేదో గానీ అభం శు భం తెలియని పసిగుడ్డులను కన్న తల్లిదండ్రులు రోడ్డుపై వదిలేస్తున్నా రు. ఫలితంగా వారు అనాథలవుతున్నారు. గత నెల 30వ తేదీ దిగువగూళూరు వద్ద పసిపాపను ముళ్లపొదల పాలు చేసిన సంఘటన మరచిపోక ముందే మరో ఆడబిడ్డ అనా థ అయ్యింది. ఐసీడీఎస్ సీడీపీఓ పద్మజారెడ్డి కథనం మేరకు... స్థాని క తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం సుమారు ఏడాదిన్నర వయసు ఉన్న ఆడబిడ్డ ను వదిలేసి వెళ్లిపోయారు.
కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చిన స్థానికులు పాప ఒంటరిగా ఉండ డం గమనించి, తల్లిదండ్రుల కోసం ఆరా తీశారు. అయినా ఫలి తం లేకపోవడంతో స్థానికులు పు త్తూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ హనుమంత ప్ప ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చి సీడీపకో పద్మజారెడ్డికి పాపను అప్పగించారు. పాపను ఆ రోగ్య పరీక్షల నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆ రోగ్య పరిస్థితి బాగుంటే శిశువి హార్‌కు తరలిస్తామని సీడీపీఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment