family prblems
-
అమ్మా, పెళ్లికి వెళ్లొస్తాం.. శుభకార్యం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి!
సాక్షి, జగిత్యాల: ‘అమ్మా.. నాన్నతో కలిసి పెళ్లికి వెళ్తున్నం.. అక్క, నువ్వు కూడా వస్తే బాగుండు.. కానీ, మీరు ఎందుకు రావడం లేదు..? అయినా మేం వెళ్లి వస్తం.. బైబై’ అంటూ తండ్రితో కలిసి సంతోషంగా బయటకు వెళ్లారు.. పెళ్లి వేడుకకు హాజరై విందు ఆరగించారు.. ఆ తర్వాత ఇంటిదారి పట్టారు.. కొద్దిక్షణాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపే.. తండ్రి వారిద్దరినీ బావిలోకి తోసేశాడు.. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శుక్రవారం రాత్రి 9.30గంటల సమయంలో నర్సింగాపూర్ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం జలపతిరెడ్డి(45) – కవిత దంపతులు. వీరికి కూతుళ్లు జాష్మిత, ప్రణిత్య, మధుమిత ఉన్నారు. జాష్మిత కండ్లపల్లి మోడల్ స్కూల్లో ఏడోతరగతి, మిగతా ఇద్దరు జగిత్యాలలోని ఓ ప్రైవేట్ బడిలో వరుసగా నాలుగో, రెండోతరగతి చదువుతున్నారు. తను అప్పు ఇచ్చి.. మరికొందరి వద్ద అప్పు చేసి. జలపతిరెడ్డి కొందరికి కొంత అప్పు ఇచ్చాడు. వారు తిరిగి ఇవ్వడంలేదు. తన కుటుంబ అవసరాలకో సం అతడు కూడా రూ.4 లక్షల వరకు అప్పు చేశాడు.అవి తీర్చే దారిలేకపోవడం, ప్రభుత్వం సేకరించిన నాలుగెకరాలకు సంబంధించిన పరిహారం ఇప్పించడంలో ఓ న్యాయవాది తీవ్ర జాప్యం చేయడంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు తన రెండోకూతురు ప్రణిత్య, చిన్నకూతురు మధుమితను వెంటబెట్టుకుని ద్విచక్ర శుక్రవారం రాత్రి 8గంటలకు జగిత్యాలకు బయలు దేరాడు. ► ఓ ఫంక్షన్హాల్లో వేడుకకు హాజరై అందరూ విందు భోజనం చేశారు. ► రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురూ ఇంటికి బయల్దేరారు. ► నర్సింగాపూర్ శివారులోని ఎల్లమ్మగుడి వద్దగల వ్యవసాయ బావివద్దకు చేరుకున్నారు. ► తొలుత తన ఇద్దరు కుమార్తెలను జలపతిరెడ్డి బావిలో తోసేశాడు. ► ఆపై తానూ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ► రాత్రి 10 గంటల వరకూ పిల్లలు, భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కవిత ఆందోళన చెందింది. ► పలుమార్లు ఫోన్‌చేయగా లిఫ్ట్ కాలేదు. మనసులో ఏదో కీడు శంచింకింది. ► ఉదయం 8 గంటల సమయంలో నర్సింగాపూర్ ఎల్లమ్మ గుడి వద్ద తన సోదరుడు రాజిరెడ్డి వ్యవసాయ పొలం వద్ద జలపతిరెడ్డి మృతదేహం లభ్యమైంది. ► సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ ప్రకాశ్, రూరల్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై అనిల్.. బాలికల కోసం ఆరా తీశారు. ► అయితే, ధరూర్‌కు చెందిన చల్ల వెంకన్నకు జలపతిరెడ్డి తనకు తనకు మిగిలిన ఎకరం విక్రయించిన భూమిలోని బావిలో చిన్నారుల మృతదేçహాలు కనిపించాయి. పథకం ప్రకారమే.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న జలపతి రెడ్డి.. భార్య కవితకు కుమార్తెలు భారం కాకూడదని భావించాడు. పథకం ప్రకారమే కూతుళ్లను శుభకార్యానికి తీసుకెళ్లేందుకు సిద్ధం చేశాడు. పిల్లల్ని బావిలో తోసేస్తూ తన ఫోన్లో చిత్రీకరించినట్లు తెలిసింది. అంతకు ముందే అక్కడ సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు. భార్యకు వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు. పెద్దకూతురు ప్రాణాలు కాపాడిన హోంవర్క్ పెద్దకుమార్తె జాష్మితను తమతోపాటే తీసుకెళ్లేందుకు జలపత్తిరెడ్డి యత్నించాడు. కానీ తన కు హోంవర్క్ ఉందని, పెళ్లికి రాను అని బాలి క మొండికేసింది. తండ్రి బుజ్జగించినా ససే మిరా అనడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. గ్రామంలో విషాదం. లపతిరెడ్డి తన ఇద్దరు కుమార్తెలతో ఆత్మహత్య చేసుకోవడం నర్సింగాపూర్ గ్రామంలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. జలపతిరెడ్డి అందరితో కలిసిమెలిసి ఉండేవాడని గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. భార్య, పెద్దకూతురు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, పెద్ద కుమార్తె జాష్మిత.. తన తండ్రి చితికి నిప్పంటించగా ప్రణిత్య, మధుమితల మృతదేహాలకు పూడ్చిపెట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. అంత్యక్రియలకు హాజరయ్యారు. న్యాయవాదే కారణమని సూసైడ్ నోట్ జగిత్యాల శివారులోని టీఆర్‌నగర్ గ్రామం స్థాపించేందుకు రాష్ట్రప్రభుత్వం 1985లో జలపతిరెడ్డికి ఉన్న ఐదెకరాల్లో నాలుగు ఎకరాలు సేకరించింది. ఆయనతోపాటు నర్సింగాపూర్ గ్రామానికే చెందిన రైతుల నుంచి కూడా 45.20 ఎకరాలు సేకరించింది. అయితే, కోర్టులో కేసు వేయగా తొలిదశలో ఎకరాకు రూ.16వేల చొప్పున వడ్డీతో కలిపి మొత్తం రైతుల కోసం రూ.45,95,516 సొమ్మును రెవెన్యూ శాఖ కోర్టులో జమచేసింది. ఆ సొమ్ములో తనకు రావాలి్సన సొమ్ము ఇప్పించాలని న్యాయవాదిని జలపతిరెడ్డి చాలాసార్లు కలిసి విన్నవించాడు. డబ్బులు ఇప్పించడంలో లాయర్ నిర్లక్ష్యం చేశాడు. ఒకవైపు తనకున్న ఎకరం విక్రయించినా చేసిన అప్పులు తీరే దారిలేకపోవడం, ఇతరులకు ఇచ్చిన అప్పులు రాకపోవడం కూడా తోడుకావడంతో జలపతిరెడ్డి మనస్తాపం చెందాడు. తన చావుకు న్యాయవాదే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన భర్త ఆత్మహత్యకు న్యాయవాది కారణమని మృతుడి భా ర్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు న్యాయవాది దామోదర్‌రా వుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. -
ఎంపీటీసీ సభ్యురాలి బలవన్మరణం
సాక్షి, పెబ్బేరు (కొత్తకోట): ఉన్నత విద్యావంతురాలైన ఓ యువ ప్రజాప్రతినిధి కుటుంబ కలహాలతో అకాలంగా మృత్యుఒడికి చేరింది. గెలుపును పూర్తిగా ఆస్వాదించకుండా.. గ్రామాభివృద్ధికి తనవంతుగా సహాయపడకుండానే అనంతవాయువులో కలిసిపోయింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని గుమ్మడంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య కూతురు రజిత(23) ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీ చేసి గెలుపొందింది. అయితే సోమవారం సాయంత్రం ఇంట్లో తల్లిదండ్రులతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి రజిత వ్యవసాయం కోసం తెచ్చిన పురుగు (గడ్డి) మందు తాగి అస్వస్థతకు గురైంది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే పెబ్బేరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. సమాచారం అందుకున్న కొత్తకోట సీఐ వెంకటేశ్వరరావు, శ్రీరంగాపురం ఎస్ఐ ఎండీ షఫీ, ఏఎస్ఐ జయన్న అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహానికి వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఉన్నత విద్యావంతురాలు గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య టీఆర్ఎస్ నాయకుడు. ఈయన కూతురు రజిత చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేది. ఎంఫార్మసీ పూర్తిచేసింది. ఈ క్రమంలో ప్రాదేశిక ఎన్నికల్లో గ్రామం నుంచి ఉన్నత విద్యావంతురాలైన రజిత టీఆర్ఎస్ తరఫున ఎంపీటీసీ సభ్యురాలిగా పోటీలో నిలిచి 18 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఈ నెల 4న పెబ్బేరు మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, అధికారుల సమక్షంలో ఎంపీటీసీగా ప్రమాణస్వీకారం చేసింది. అయితే ఉన్నత విద్యావంతురాలైన రజిత గ్రామాభివృద్ధికి బాటలు వేస్తారని ఊహించిన గ్రామస్తులకు తీరని విషాదం మిగిల్చి అనంతలోకాలకు వెళ్లిపోయింది. రజిత అకాల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంత్రి నివాళి.. ఎంపీటీసీ సభ్యురాలు రజిత మృతి సమాచారం తెలుసుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి గ్రామానికి చేరుకున్నారు. ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ, ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జెడ్పీచైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీధర్, పెబ్బేరు జెడ్పీటీసీ సభ్యురాలు పద్మ, ఎంపీపీ ఆవుల శైలజ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుచ్చారెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కర్రెస్వామి, మాజీ ఎంపీపీ పద్మావతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హరిశంకర్‌నాయుడు, నాయకులు సంతోష్, బాల్‌రాం, రాములు, గోపాల్, బీచుపల్లి, శాంతన్న, భారతి, అక్కమ్మ, జ్యోతి, ఎల్లయ్య, ఎల్లారెడ్డి, శివశంకర్‌గౌడ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు రజిత భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ప్రతి రోజూ ఆ ప్రశ్న అడగాలి!
సాక్షి, హైదరాబాద్: వివాహ జీవితం, రిలేషన్షిప్లో సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు కానీ చాలా సార్లు అనుకున్నట్లుగా ఉండలేకపోతుంటారు. డబ్బు, పలుకుబడి ఉంటేనే సంతోషంగా ఉండగలమని కొన్ని జంటలు అనుకుంటాయని కానీ అది కూడా సరైన అభిప్రాయం కాదని నిపుణులు అంటున్నారు. ప్రేమలో నిజాయితీగా ఉండటమే సంతోషానికి కారణమని తెలిపారు. కింది సూచనలు పాటించడం ద్వారా రిలేషన్‌షిప్‌ను ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 1. భాగస్వామికి అండగా నిలవాలి... జీవితం విషయంలో, ఉద్యోగ విషయాల్లో మీ పార్టనర్‌కు తోడుగా నిలబడండి. వారికి ఉన్న గోల్స్‌ను సాధించుకొనే క్రమంలో మీ వంతు సహకారాన్ని వారికి అందించండి. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రోత్సాహాన్ని అందించండి. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అలవర్చుకోవాలి. 2. అన్నీ మంచి రోజులే ఉండవు... రిలేషన్షిప్లో అన్నీ సంతోషకరంగా గడిచే క్షణాలే ఉండవు. కొన్నిసార్లు మనస్పర్థలు, గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో సంయమనం పాటించడం నేర్చుకోవాలి. మంచిరోజులైనా, చెడురోజులైనా ఒకరినొకరు అర్థం చేసుకొని అండగా నిలవాలి. ఏరోజు జరిగిన గొడవలను ఆ రోజు రాత్రికల్లా పరిష్కరించుకొని తర్వాతి రోజును ప్రేమతో ఆరంభించాలి. 3. సమయం గడపాలి... ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ భాగస్వామితో కొంత సమయం గడపడానికి ప్రయత్నించాలి. రిలేషన్షిప్లో మీ వారితో మీరు ఎంత సమయం గడుపుతున్నారన్నదే ఆ బంధం లోతును తెలియజేస్తుంది. ఈ రోజు ఎలా గడిచింది ? అనే ప్రశ్న ప్రతి రోజూ అడగాలి. మీ భాగస్వామి మీతో ఎంతో మాట్లాడాలని, చెప్పాలని ఉన్నప్పటికీ మీరు అడగకపోతే కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు. సమయం దొరికినపుడు విహారయాత్రలకు కలిసి వెళ్లి సంతోషంగా గడిపిరావాలి. 4. నిజమైన మిత్రులు... కుటుంబమైనా, రిలేషన్షిప్ అయినా పురుషులు, మహిళలు మిత్రులుగా ఉంటేనే ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. ఇద్దరి మధ్యలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. మీకు ఎదురయ్యే ఇబ్బందులను, ఆనందాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. ప్రేమ బంధానికి స్నేహం జతకలిస్తేనే అది అవిభాజ్య బంధంగా మారుతుంది. 5. బయటకు కనిపించాలి.... రిలేషన్షిప్లో ఎదురయ్యే పలు ఇబ్బందులను మీరు అధిగమించడం మీ తోటి మిత్రులు చూడాలి. రోజురోజుకు బలపడుతున్న మీ బంధానికి వారే సాక్షులుగా నిలవాలి. దాని నుంచి వారు నేర్చుకోవడం మాత్రమేగాక సమాజంలో ఇదో బాధ్యత అనే విషయం మీకు కూడా బోధపడుతుంది. ఈ విషయాల పట్ల కొంచెం జాగ్రత్త తీసుకొని, అనుదిన జీవితంలో పాటించడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. -
బంధాన్ని బలపరిచే మూడు ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: మీరెప్పుడైనా రిలేషన్షిప్లో చెప్పకూడని విషయం చెప్పి చిక్కుల్లో పడ్డారా ? ఎందుకు ఈ విషయం చెప్పానా అని తర్వాత బాధపడ్డారా ? ఏయే విషయాలు ఎప్పుడెప్పుడు చెప్పాలో అర్థం కాక తికమక పడుతున్నారా ? అయితే ఈ సమస్యకు 'మూడు ప్రశ్నల ట్రిక్' చక్కగా ఉపయోగపడుతుందని, బంధాలను బలపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ట్రిక్‌ను పరిచయం చేసింది ఎవరు ? ప్రముఖ నటుడు, రచయిత క్రెయిగ్ ఫెర్గూసన్ ఈ 'మూడు ప్రశ్నల ట్రిక్' ను ప్రపంచానికి పరిచయం చేశారు. భాగస్వామితో మాట్లాడే సమయంలో ఈ మూడు ప్రశ్నలను మనసులో స్మరించుకోవడం ద్వారా అనవసరంగా తలెత్తే మనస్పర్థల నుంచి దూరంగా ఉండవచ్చన్నది ఆయన ఆలోచన. ఈ ట్రిక్‌ను పాటించడం వల్ల మీ ఆత్మీయులతో అర్థవంతమైన సంభాషణ జరపవచ్చని ఆయన అన్నారు. అటువంటి మృదు సంభాషణలు బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయని ఆయన స్పష్టం చేశారు. మొదటి ప్రశ్న... ఈ విషయం చెప్పడం అవసరమా ? అన్న ప్రశ్నను మనసులో వేసుకోవాలి. చాలా సార్లు అసలు సంబంధం లేని విషయాలను చెప్పి మీ ఆత్మీయులను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఆ క్షణంలో అది చాలా సాధారణమైనదిగా కనిపించినప్పటికీ, తర్వాత అది మనస్పర్థలకు దారితీసి ఉండవచ్చు. కాబట్టి ఈసారి మీ ఆత్మీయులతో మాట్లాడేటపుడు ఈ ప్రశ్నను మదిలో వేసుకోండి. రెండవ ప్రశ్న... ఇది నేనే చెప్పాలా ? ఆ విషయాన్ని మీరే కాక ఇతరులూ చేప్పే అవకాశం ఉన్నపుడు మీరు తప్పుకోవడమే మంచిది. నేను తప్ప ఇంకెవరూ చెప్పే అంశం కాదు అన్న సందర్భంలోనే నోరు విప్పండి. మీరే చెప్పాల్సి వస్తే, అవతలి వారి దృష్టికోణం నుంచి కూడా పరిశీలించి చెప్పాలి. లోకంలోని ప్రతీ విషయాన్ని మీరే చెప్పాలన్న నియమమేదీ లేదు. చివరి ప్రశ్న... ఇది నేను ఇప్పుడే చెప్పాలా ? ప్రతీ దానికీ సరైన సమయమంటూ ఒకటి ఉంటుంది. ఓపికతో ఎదురుచూసి సరైన సమయంలో ఆ విషయాన్ని తెలియజేయాలి. ఉదాహరణకు ఏదైనా మనస్ఫర్థతో ఎడమొహం పెడమొహంగా ఉన్న సమయంలోనే పాత సమస్యలను గుర్తు చేస్తే బంధం మరింత ప్రమాదంలో పడుతుంది. ఇదంత ఈజీ కాదు.. చూడడానికి ఇది ఈజీగానే కనిపిస్తున్నప్పటికీ, ఆచరించేటపుడు కొంచెం ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది. తరచుగా ఉపయోగించడం ద్వారా ఈ ట్రిక్‌పై పట్టు సాధించవచ్చని ఫెర్గూసన్ అంటున్నారు. ముఖ్యమైన విషయాలు చర్చించే సమయంలో దీనిని ఉపయోగిస్తే మనస్పర్థలు తగ్గి బంధం బలపడుతుందని ఆయన అన్నారు. -
పాపం.. అనాథలవుతున్నారు!
పుత్తూరు: కుటుంబసమస్యలో.. పోషించే స్తోమత లేదో గానీ అభం శు భం తెలియని పసిగుడ్డులను కన్న తల్లిదండ్రులు రోడ్డుపై వదిలేస్తున్నా రు. ఫలితంగా వారు అనాథలవుతున్నారు. గత నెల 30వ తేదీ దిగువగూళూరు వద్ద పసిపాపను ముళ్లపొదల పాలు చేసిన సంఘటన మరచిపోక ముందే మరో ఆడబిడ్డ అనా థ అయ్యింది. ఐసీడీఎస్ సీడీపీఓ పద్మజారెడ్డి కథనం మేరకు... స్థాని క తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం సుమారు ఏడాదిన్నర వయసు ఉన్న ఆడబిడ్డ ను వదిలేసి వెళ్లిపోయారు. కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చిన స్థానికులు పాప ఒంటరిగా ఉండ డం గమనించి, తల్లిదండ్రుల కోసం ఆరా తీశారు. అయినా ఫలి తం లేకపోవడంతో స్థానికులు పు త్తూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ హనుమంత ప్ప ఐసీడీఎస్ అధికారులకు సమాచారమిచ్చి సీడీపకో పద్మజారెడ్డికి పాపను అప్పగించారు. పాపను ఆ రోగ్య పరీక్షల నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆ రోగ్య పరిస్థితి బాగుంటే శిశువి హార్‌కు తరలిస్తామని సీడీపీఓ తెలిపారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్మ
బసంత్ నగర్: కుటుంబంలో తలెత్తిన కారణాలతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామకుండం మండలం బసంత్ నగర్ లో గురువారం జరిగింది. స్ధానికంగా నివాసముంటున్న వడ్డేపల్లి శ్రీనివాస్(35) సిమెంట్ కర్మాగారంలో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున అందరూ నిద్రపోతుండగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
నవాబుపేట: కుటుంబ వివాదాల కారణంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం చించెన్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పల్గుట శ్రీశైలం, లక్ష్మి(22) దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి పురుగుల మందు తాగింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న శ్రీశైలం..భార్య అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించి వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ లక్ష్మి కన్నుమూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.