
మోత్కూరు: కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంపీపీ ఎన్నికలలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు, బెదిరింపులతో టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్ తీరుపై పార్లమెంట్‌లో చర్చించేలా చేస్తానని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తానని చెప్పార