సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. నాలుగైదు రోజుల్లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని యోచిస్తున్నారు. ఈ నెల 7తో శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమా వళి ముగియనుండగా, ఆ తర్వాత ఏ క్షణం లోనైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఆదివారం ఉదయం పబ్లిక్ గార్డెన్స్‌లో 6వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని, అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో గంటకు పైగా సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, ఐదేళ్ల తెలంగాణలో సాధించిన పురోగతి, విజయాలు, ఏపీ–తెలంగాణ మధ్య విభేదాల పరిష్కారం తదితర అంశాలపై ఈ భేటీలో గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. కొత్తగా మంత్రివర్గంలో చేరనున్న వారికి కేటాయించనున్న శాఖలు, ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరి శాఖల మార్పు అంశం సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా గవర్నర్, కేసీఆర్ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మా ణానికి గత ఐదేళ్లలో పటిష్ట పునాదులు పడ్డాయని, కొత్త రాష్ట్రమైనప్పటికీ అవరోధాల న్నింటినీ అధిగమించి అద్భుత ప్రగతి సాధించిం దని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం, సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment