Cabinet expansion TRS
-
నాలుగైదు రోజుల్లో కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సీఎం కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. నాలుగైదు రోజుల్లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని యోచిస్తున్నారు. ఈ నెల 7తో శాసనమండలి ఎన్నికల ప్రవర్తన నియమా వళి ముగియనుండగా, ఆ తర్వాత ఏ క్షణం లోనైనా మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఆదివారం ఉదయం పబ్లిక్ గార్డెన్స్‌లో 6వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని, అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో గంటకు పైగా సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, ఐదేళ్ల తెలంగాణలో సాధించిన పురోగతి, విజయాలు, ఏపీ–తెలంగాణ మధ్య విభేదాల పరిష్కారం తదితర అంశాలపై ఈ భేటీలో గవర్నర్‌తో సీఎం కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. కొత్తగా మంత్రివర్గంలో చేరనున్న వారికి కేటాయించనున్న శాఖలు, ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరి శాఖల మార్పు అంశం సైతం చర్చకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా గవర్నర్, కేసీఆర్ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మా ణానికి గత ఐదేళ్లలో పటిష్ట పునాదులు పడ్డాయని, కొత్త రాష్ట్రమైనప్పటికీ అవరోధాల న్నింటినీ అధిగమించి అద్భుత ప్రగతి సాధించిం దని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం, సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. -
ప్రశాంత్‌రెడ్డి అనే నేను..!
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ప్రశాంత్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్ హోదాలో మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించా రు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రత్యే క రాష్ట్ర సాధన లక్ష్యంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: మంత్రివర్గ విస్తరణలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డికి చోటు దక్కింది. మంగళవారం ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రశాంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని సీ ఎం నివాసం ప్రగతిభవన్లోనే ఉన్నారు. ఈ మేరకు ఆయనకు సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారు. ప్రశాంత్‌రెడ్డికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై మంగళవారమే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. తమ నేతకు మంత్రి పదవి లభించనుండటంతో నియోజకవర్గంలో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రశాంత్‌రె డ్డి 2014, తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ప్రభుత్వ హయాంలోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన ప్రశాంత్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కూడా కేబినెట్ హోదాలో మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఈసారి కేసీఆర్ నేరుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. స్వతహాగా ఇంజనీర్ అయిన ప్రశాంత్‌రెడ్డికి కేసీఆర్ తన కలల ప్రాజెక్టు అయిన మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) బాధ్యతలను అప్పగించారు. 2016లో ఏప్రిల్ 29న ఆయన మిషన్‌భగీరథ వైస్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఈ ప్రాజెక్టు పనులను ముం దుకు తీసుకెళ్లడంలో కృషి చేశారు. ఉద్యమంలో చురుగ్గా.. 2001లో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో తం డ్రి వేముల సురేందర్‌రెడ్డితో కలిసి పని చేశారు. తెలంగాణ ఉద్యమం లో చురుగ్గా పా ల్గొన్నారు. 2010లో సీఎం కేసీఆర్ ప్రశాంత్‌రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఉద్యమ సమ యంలో కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజక వర్గంలో ఉద్యమాన్ని చేపట్టారు. సాగరహారం, అసెంబ్లీ ముట్ట డి, రైల్‌రోకో, వంటావార్పు లాంటి అనేక ఆం దోళన, నిరసన కార్యక్రమాల్లో పాల్గొ న్నారు. ఉద్యమ సమయంలో రైల్‌రోకో, ఇతర కేసులు ఎదుర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి.. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గ అభి వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. చెక్‌డ్యామ్‌లు, ఇలా 40 ప్రత్యేక సాగునీటి పనులను రూ.200 కోట్లతో చేపట్టారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలైన రోడ్లు పనులకు భారీగా నిధులు మంజూరయ్యాయి. ప్రశాంత్‌రెడ్డి బయోడేటా.. పేరు: వేముల ప్రశాంత్‌రెడ్డి విద్యార్హత : బీఈ సివిల్ (బాల్కి, కర్ణాటక) తండ్రి: కీ.శే.వేముల సురేందర్‌రెడ్డి తల్లి : మంజుల భార్య : నీరజా రెడ్డి కుమారుడు : పూజిత్‌రెడ్డి– ఎంబీబీఎస్ కుమార్తె : మానవి రెడ్డి (బీటెక్)– సీబీఐటీలో సోదరుడు : వేముల శ్రీనివాస్ (అజయ్‌రెడ్డి– వెటర్నరీ సీనియర్ డాక్టర్) సోదరి : రాధిక (గ్రూప్–1 ఆఫీసర్) జననం: 14.03.1966 బాల్యం విద్యాభ్యాసం : వేల్పూర్, కిసాన్‌నగర్ వృత్తి : ప్రఖ్యాత బిల్డర్‌గా హైదరాబాద్‌లో పేరుగాంచారు. -
అన్నీ బడ్జెట్ తర్వాతే!
కేబినెట్ విస్తరణ, పదవుల భర్తీ, ప్లీనరీ సమావేశాలు అన్ని కార్యక్రమాలు తర్వాతే చేపట్టాలని కేసీఆర్ యోచన హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల తర్వాతే తన మార్కు పాలన మొదలుపెట్టాలని, అన్ని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. కేబినెట్ విస్తరణ మొదలు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల వరకు అన్ని కార్యక్రమాలనూ బడ్జెట్ తర్వాతే చేపట్టాలని యోచిస్తున్నారు. ఈ మేరకు సన్నిహితులతో సీఎం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సెప్టెంబర్ తొలి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని అప్పట్లో సర్కారు ప్రకటించినా ఇప్పటివరకు కుదరలేదు. అయితే వచ్చే నెల తొలివారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశమున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్లకు పాలకవర్గాల ఎంపిక, మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలు, కేంద్ర సర్వీసు అధికారుల బదిలీలు(ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల కేటాయింపులు పూర్తయితే) తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంటున్నారు. నిజానికి బుధవారమే(22న) కేబినెట్ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. అయితే రెండు రోజులుగా సీఎంతో పలు అంశాలపై అభిప్రాయాలను పంచుకున్న పలువురు నాయకులు మాత్రం దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమావాస్యకు ముందు కేసీఆర్ ఆ పని చేపట్టబోరని వారు చెబుతున్నారు. ముహూర్తాలు, శకునాలపై విశ్వాసమున్న సీఎం.. 22న కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశం లేదంటున్నారు. బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం: బడ్జెట్ సమావేశాలను వచ్చే నెల తొలివారంలో నిర్వహించే అవకాశమున్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ నెల 27న సమావేశాలు ప్రారంభించాలని తొలుత అనుకున్నా పలు కారణాలతో దాన్ని నవంబర్ మొదటి వారానికి మార్చుకున్నట్టు తెలుస్తోంది. పనులన్నింటిలో జాప్యానికి కేంద్ర సర్వీసు అధికారుల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యమే కారణమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారుల సంఖ్య పరిమితంగా ఉండటంతో వారికి ఎక్కువ బాధ్యతలను అప్పగించాల్సి వస్తున్నదని అంటున్నాయి.