పార్టీ పదవులకు స్టాలిన్ రాజీనామా!
చెన్నై: లోకసభ ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఫలితాలను సాధించడానికి నైతిక బాధ్యత వహిస్తూ డీఏంకే కోశాధికారి, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
స్టాలిన్ తన పదవులకు రాజీనామా చేశారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత మీడియాకు వెల్లడించారు. తాజా లోకసభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే పార్టీ 37 సీట్లు గెలుచుకోగా, బీజేపీ, పీఎంకే పార్టీలు చెరో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.