M.K. Stalin
-
పాతికేళ్ల దాకా పునర్విభజన వద్దు
సాక్షి, చెన్నై: జనాభా ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న ప్రతిపాదనను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘పునర్విభజన ప్రక్రియపై ప్రస్తుతమున్న నిషేధాన్ని మరో పాతికేళ్ల దాకా పొడిగించాలి. 1971 జనాభా లెక్కల ఆధారంగా ఖరారు చేసిన లోక్‌సభ స్థానాల ప్రస్తుత సంఖ్యనే అప్పటిదాకా కొనసాగించాలి’’అని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. పునర్విభజన ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, న్యాయబద్ధంగా, అందరి ఆమోదంతో మాత్రమే జరగాలని తేల్చిచెప్పింది. స్టాలిన్ నేతృత్వంలో జేఏసీ శనివారం చెన్నైలో తొలిసారిగా సమావేశమయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పార్టీల నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీల ద్వారా ఉమ్మడిగా విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించారు. కేంద్రం చేపట్టే ఎలాంటి డీలిమిటేషన్ ప్రక్రియపై అయినా ముందుగా భాగస్వామ్య పక్షాలన్నింటితోనూ చర్చించాల్సిందేనని జేఏసీ సభ్యులు కుండబద్దలు కొట్టారు. ‘‘అందరి భాగస్వామ్యంతో మాత్రమే డీలిమిటేషన్ జరగాలి. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో కచ్చితంగా సంప్రదింపులు జరపాలి. అభిప్రాయాలు తెలుసుకోవాలి. లోక్‌సభ స్థానాల పునర్విభజన మన ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవ ప్రతిష్టలను పెంచేలా ఉండాలి’’అని పేర్కొన్నారు. ఈ మేరకు రూపొందించిన తీర్మానాన్ని జేఏసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘‘జనాభా నియంత్రణ చర్యలను సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని 42, 84, 87వ రాజ్యాంగ సవరణలు సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా జనాభా విషయంలో స్థిరీకరణ సాధించాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు. అందుకే 1971 నాటి జనగణన ఆధారంగా నిర్ధారించిన లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యపై పరిమితిని మరో 25 ఏళ్లపాటు పొడిగించాలి. రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించకూడదు. జనాభా నియంత్రణ చర్యలతో జనాభాను గణనీయంగా తగ్గించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. ఈ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం తగిన రాజ్యాంగ సవరణలు చేయాలి’’అని తీర్మానంలో పేర్కొన్నారు. తమ డిమాండ్లను లెక్కచేయకుండా కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే కలిసికట్టుగా అడ్డుకోవడానికి ఎంపీలతో కూడిన కోర్ కమిటీ ద్వారా సమన్వయం చేసుకోవాలని, ఆ మేరకు వ్యూహాలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ‘జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్’కు వ్యతిరేకంగా శాసనసభల్లో తీర్మానాలు ఆమోదించి కేంద్రానికి పంపించాలని నిర్ణయానికొచ్చారు. గతంలో జరిగిన డీలిమిటేషన్ ప్రక్రియల చరిత్ర, వాటి ఉద్దేశం, ప్రతిపాదిత పునర్విభజన వల్ల తలెత్తే విపరిణామాలపై తమ రాష్ట్రాల్లో ప్రజలకు పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. తమిళనాడులో అధికార డీఎంకే దీనిపై ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. సమావేశంలో స్టాలిన్, పినరయి విజయన్, రేవంత్‌రెడ్డి, భగవంత్‌మాన్, కేటీఆర్, డీకే శివకుమార్, సురేశ్‌రెడ్డి, వద్దిరాజు, వినోద్‌కుమార్, మహేశ్‌గౌడ్, మల్లు రవి తదితరులు దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు: విజయన్ ప్రతిపాదిత పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు గొడ్డలిపెట్టు వంటిదేనని విజయన్ తేల్చిచెప్పారు. జనాభా తగ్గించినందుకు ఇస్తున్న బహుమానం ఇదేనా అని మండిపడ్డారు. పునర్విభజనపై ముందుకెళ్లే ముందు కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో అర్థవంతమైన చర్చలు జరపాలన్నారు. ‘‘ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే లోక్‌సభ సీట్లు ఉత్తరాదిన పెరిగి దక్షిణాదిన తగ్గుతాయి. తద్వారా బీజేపీ లాభపడుతుంది. స్వీయ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్నదే బీజేపీ ఆలోచన’’అని మండిపడ్డారు. జేఏసీ సమావేశం అనంతరం విజయన్ ‘ఎక్స్’లో పలు పోస్టులు చేశారు. దేశ సమాఖ్య వ్యవస్థపై సంఘ్ పరివార్ బహిరంగ యుద్ధం ప్రారంభించిందని ధ్వజమెత్తారు. సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా పోరాటం చేయాలని దక్షిణాది రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. సమాఖ్య ప్రజాస్వామ్యానికి ముప్పు: డీకే కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దేశ సమాఖ్య ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పని డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంచేస్తున్న రాజకీయ దాడిగా అభివరి్ణంచారు. ‘‘సమాఖ్య నిర్మాణం మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. అంబేడ్కర్‌తో పాటు రాజ్యాంగ రూపకర్తలు నిర్మించిన సమాఖ్య ప్రజాస్వామ్య పునాదులను కూల్చివేయొద్దు’’అని కేంద్రానికి సూచించారు. ‘‘ఆధిపత్యాన్ని అంగీకరించడమా? తిరుగుబాటు చేయడమా? ప్రగతిశీల రాష్ట్రాలకు ఇప్పుడు ఈ రెండే అవకాశాలున్నాయి. మేం తిరుగుబాటునే ఎంచుకున్నాం’’అని ఉద్ఘాటించారు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. జాతీయ వేదికపై దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడానికి కేంద్రం కుట్రలు సాగిస్తోందని ఆరోపించారు. దక్షిణాదిపై హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీలతో చర్చించాలి: నవీన్ పట్నాయక్ పార్లమెంట్లో, అసెంబ్లీల్లో ఎన్ని స్థానాలు ఉండాలో నిర్ణయించడానికి జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దని బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియపై అన్ని పార్టీలతో సమగ్రంగా చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. జేఏసీ భేటీని ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. ఒడిశా ప్రజల ప్రయోజనాల కోసం తమ పార్టీ పోరాడుతుందని స్పష్టంచేశారు. డీమిలిటేషన్పై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. జనాభాను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాల ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని, ప్రజల హక్కులను కేంద్రం కాపాడాలన్నారు. దేశ అభివృద్ధి కోసం జనాభా నియంత్రణ అనేది అత్యంత కీలకమైన జాతీయ అజెండా అని నవీన్ వివరించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపడితే తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుందని పేర్కొన్నారు. బీజేడీ తరఫున మాజీ మంత్రి సంజయ్ దాస్, మాజీ ఎంపీ అమర్ పట్నాయక్ భేటీలో పాల్గొన్నారు.మన ఆమోదం లేకుండానే చట్టాలు: స్టాలిన్ లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై రాజకీయ, న్యాయపరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని స్టాలిన్ చెప్పారు. పునర్విభజన పూర్తిగా న్యాయబద్ధంగా, పారదర్శకంగా జరగాలన్నారు. ప్రజాస్వామ్య ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసేలా చర్యలు చేపడితే ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. కేవలం జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే పలు రాష్ట్రాలకు చాలా నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ఇప్పుడు గానీ, భవిష్యత్తులో గానీ జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దు. సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గరాదు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే పార్లమెంట్లో చట్టాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుంది. మన ఆమోదం లేకుండానే చట్టాలు రూపొందితే మన ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది. సామాజిక న్యాయం దెబ్బతింటుంది’’అని ఉద్ఘాటించారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారం కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని వ్యాఖ్యానించారు. ఈ జేఏసీ సమావేశం చరిత్రలో నిలిచిపోతుందని స్టాలిన్ అన్నారు. ఈ భేటీని ‘జేఏసీ ఫర్ ఫెయిర్ డీలిమిటేషన్’గా పిలుద్దామని ప్రతిపాదించారు. జేఏసీ రెండో భేటీ హైదరాబాద్‌లో జరుగుతుందని చెప్పారు. తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. రెండో భేటీ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నేతలు ఏకాభిప్రాయానికి వచి్చనట్లు సమాచారం. -
దక్షిణాది హక్కుల శంఖారావం
కేంద్రానికీ, దక్షిణాది రాష్ట్రాలకూ మధ్య ఏకీ భావ, సానుకూల వాతావరణం రోజురోజుకీ చెదిరి పోతున్నది. ఈ నేపథ్యంలో – తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ నెల 22న చెన్నైలో దక్షిణాది ముఖ్యమంత్రుల సమావే శాన్ని ఏర్పాటు చేయటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజా స్వామిక కూటమి (ఎన్డీయే)లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా దేశంలోని తక్కిన దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ ఆహ్వాన పత్రాలు పంపారు. నూతన విద్యా విధానం పేరుతో హిందీ బోధనను తప్పనిసరి చేయాలని చూడటం, నియోజకవర్గాల పునర్విభ జనకు రంగం సిద్ధం చెయ్యటం వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను అడ్డుకోవటం కోసం మద్దతును సమీకరించుకునేందుకు స్టాలిన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. సమావేశానికి పశ్చిమ బెంగాల్, పంజాబ్ ముఖ్య మంత్రులనూ, ఇతర రాష్ట్రాల పార్టీ నాయకులనూ స్టాలిన్ ఆహ్వానించారు. 2056 వరకు వాయిదా వేయాలి!నియోజకవర్గాల పునర్విభజన విషయాని కొస్తే, లోక్ సభలో ప్రస్తుతమున్న 543 స్థానాల సంఖ్యను 1973లో ఏర్పాటైన మూడవ డీలిమిటే షన్ కమిషన్ 1971 జనగణన ప్రకారం నిర్ణయించింది. కుటుంబ నియంత్రణ అన్ని రాష్ట్రాల్లో పక డ్బందీగా అమలయ్యేలా చూడటం కోసం ఇంది రాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను 2001 జనాభా లెక్కల నాటి వరకు స్తంభింపజేసింది. జనాభాను తగ్గించుకుంటే దేశ ప్రజలు పరిమిత వనరులతో సుఖంగా బతకగలరనే ఉద్దేశంతో ఉత్తరాదిలో కూడా దానిని సాధించేవరకు పార్లమెంటరీ నియో జకవర్గాల పునర్విభజనను వాయిదా వేయాలని నిర్ణయించారు. కానీ, 2001 లెక్కల తర్వాత కూడా ఉత్తరాది పరిస్థితిలో మార్పు కనిపించక పోవడంతో అప్పటి వాజపేయి ప్రభుత్వం ఈ ప్రక్రియను 2026 వరకు స్తంభింపజేసింది. ఇప్ప టికీ పరిస్థితిలో మార్పు రాలేదు. ఇక ఇప్పుడు నియోజక వర్గాల విభజనను చేపడితే దక్షిణాది రాష్ట్రాలు 20 స్థానాలకు పైగా కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి. పునర్విభజన వల్ల ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమే అదనంగా 60 స్థానాలు పొందుతుందని అంచనా. అంతేకాదు, లోక్‌సభ స్థానాల్లో దక్షిణాది వాటా 19 శాతం తగ్గిపోయి, హిందీ మాట్లాడే రాష్ట్రాల వాటా 60 శాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ అన్యాయాన్ని తొలగించడం కోసం నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియను 2056 వరకు వాయిదా వేయాలని స్టాలిన్ కోరుతున్నారు. అందుకే ఈ ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ సమావేశం. ఇప్పటికే కేంద్రం నుంచి అందుతున్న నిధుల వాటాలో దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతుండటం స్పష్టంగానే కనిపిస్తోంది. తమిళ నాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి 2024లో ప్రత్యక్ష పన్నుల ద్వారా 25 శాతం, సెంట్రల్ జీఎస్టీ ద్వారా 27 శాతం నిధులు కేంద్రానికి అందగా, వాటి నుంచి ఈ రాష్ట్రాలకు 15 శాతం నిధులే వచ్చాయి. అదే సమయంలో ఉత్తర ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కేంద్రం నుంచి 36 శాతం నిధులు పొందాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వమే ఇటీవల పార్లమెంటులో తెలియజేసింది. ఆంగ్లమే కొనసాగుతుందన్న హామీ!ఇక తమిళనాడు పాటిస్తున్న ద్విభాషా విధా నానికి చాలా చరిత్రే ఉంది. 1937లో, 1968లో త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆ రాష్ట్రం దానిని వదిలించుకుంది. 1937లో, అంటే బ్రిటిష్ హయాంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీని పాలించిన సి.రాజగోపాలాచారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానిని పెరియార్ రామస్వామి సహా పలువురు పెద్దలు, ప్రతిపక్ష జస్టిస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడంతో మూడేళ్ల పాటు తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమం సాగింది. దానితో హిందీ తప్పనిసరి అనే ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా అధికార భాషపై రాజ్యాంగ సభలో వాడి, వేడి చర్చ జరిగింది. ఫలితంగా 1950 (రాజ్యాంగ అవతరణ సంవత్సరం) నుంచి 15 ఏళ్ల కాలం హిందీని అధి కార భాషగా, ఆంగ్లాన్ని అసోసియేట్ అధికార భాషగా కొనసాగించాలని నిర్ణయం తీసుకు న్నారు. దాంతో 1965 తర్వాత దేశానికి హిందీ ఏకైక అధికార భాష కాబోవడాన్ని హిందీయేతర రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఆ కారణంగా 1965 తర్వాత సైతం ఆంగ్లాన్ని కొనసాగించడానికి నిర్ణ యిస్తూ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1963లో అధికార భాషా చట్టాన్ని తెచ్చారు. అయినా దక్షి ణాదికి హిందీ భయం వదల్లేదు. 1965 దగ్గరపడ టంతో మద్రాస్ రాష్ట్రంలో హిందీ వ్యతిరేక ఉద్యమం తిరిగి పుంజుకున్నది. 70 మంది ఆందో ళనకారులు ప్రాణాలర్పించారు. దానితో హిందీ యేతర రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఆంగ్లం అధికార భాషగా కొనసాగుతుందని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హామీ ఇచ్చి పరిస్థితిని సద్దుమణిగించారు. ఆధునిక తమిళనాడు రూపశిల్పి సి.ఎన్. అన్నా దురై 1963లో పార్లమెంటులో అధికార భాషల బిల్లుపై చర్చలో మాట్లాడారు. 42 శాతం భారత ప్రజలు మాట్లాడుతున్న భాష గనుక హిందీని జాతీయభాషగా చేయాలనే డిమాండ్‌ను తన సహేతుక వాదనతో తిప్పికొట్టారు. హిందీ మాట్లాడే ప్రజలంతా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఒకే చోట కేంద్రీకృతమయ్యారని, దేశమంతటా విస్తరించి లేరని, అందుచేత హిందీ జాతీయభాష కాజాలదని స్పష్టం చేశారు. ఈ వాదన ఇప్పటికీ వర్తిస్తుంది. దక్షిణాది ప్రయోజనాలు పట్టని టీడీపీవెనుక ఇంత చరిత్ర ఉండగా, ఎన్నికల్లో లబ్ధి కోసం స్టాలిన్ ఈ సమావేశం పెడుతున్నారనటం రాజకీయమే అవుతుంది. కేంద్రం అవలంబిస్తున్న ఫెడరల్ వ్యతిరేక విధానాలపై రాష్ట్రాలను సమై క్యం, సంఘటితం చేయడానికే స్టాలిన్ సారథ్య పాత్ర వహిస్తున్నారు. ‘తెలుగుదేశం’ మూల పురు షుడు ఎన్టీ రామారావు ఏనాడో ‘కేంద్రం మిథ్య’ అన్నారు. రాష్ట్రాల స్వేచ్ఛకు, స్వతంత్ర మను గడకు ప్రాధాన్యమిచ్చే ఫెడరల్ వ్యవస్థను ఆయన గౌరవించారు. ఈ విషయంలో కేంద్రాన్ని సైతం ఢీకొన్నారు. కానీ ఇప్పటి ఆ పార్టీ నేతలు హిందీని జాతీయ భాషగా అంగీకరించని రాష్ట్రాల హక్కును, ఆ యా భాషల స్వతంత్రాన్ని హరించే ప్రయత్నాలకు అడ్డుచెప్పకపోగా అదే భారతీయత అనే పోకడలను అనుసరిస్తున్నారు. కూటమి భాగస్వాములుగా ఉంటున్నారే తప్ప, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల గురించి ఆలోచించటం లేదు. గార శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
తమిళనాట స్టాలిన్ ఏలుబడి
సుదీర్ఘమైన ఎదురుచూపులు ఫలించాయి. మొన్నటి ఎన్నికల్లో డీఎంకేను సునాయాసంగా విజయ తీరాలకు చేర్చిన ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శుక్రవారం 33మంది మంత్రులతో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తమిళనాట సుదీర్ఘకాలంగా సాగుతున్న రెండు పార్టీల వ్యవస్థ చెక్కుచెదరలేదని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఇది ఒక రకంగా బీజేపీకి మాత్రమే కాదు... కాంగ్రెస్, వామపక్షాలకు సైతం ఇబ్బందికరమే. కేబినెట్ ప్రమాణస్వీకారం తర్వాత కరోనా రోగుల కుటుంబాలకు తక్షణం రూ. 2,0000 చొప్పున, వచ్చే నెల మరో 2,000 ఇచ్చే ఫైలుపై స్టాలిన్ తొలి సంతకం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పొందే వారికయ్యే ఖర్చును సీఎం బీమా పథకం ద్వారా తిరిగి చెల్లిస్తారు. అలాగే మహిళలు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించారు. ఆఖరుసారి పదేళ్లక్రితం రాష్ట్రంలో అధికార పీఠం అందుకున్న పార్టీని ఈ స్థాయికి తీసుకెళ్లడం సామాన్యం కాదు. తండ్రి కరుణానిధి నీడలో సుదీర్ఘకాలం మనుగడ సాగించవలసి వచ్చిన స్టాలిన్, ఆయన కనుమరుగయ్యాక పార్టీని తన భుజస్కంధాలపై మోయాల్సివచ్చింది. అవతలి పక్షంలో విస్తృత ప్రజాదరణ వున్న జయలలిత సైతం కరుణానిధికి ముందే కన్నుమూశారు. ఆమె ఆరోగ్యంగా కొనసాగివుంటే స్టాలిన్ ఇంతటి విజయం సాధించేవారా అన్న ప్రశ్న ఎటూ వుంటుంది. అయితే ఇప్పుడెదురైన సవాళ్లు కూడా తక్కువేమీ కాదు. అధికార అన్నాడీఎంకేతో చేతులు కలిపిన బీజేపీ చాలా జాగ్రత్తగా పావులు కదిపింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే సమష్టిగా వుంటుందని, ప్రభుత్వాన్ని చివరికంటా నడుపుతుందని ఎవరూ అనుకోలేదు. బీజేపీ ఆ పని చేయించగలిగింది. అన్నా డీఎంకే పాలనకు పెద్దగా వ్యతిరేకత లేకుండా ఆ పార్టీ పెద్దలు సహకరించారు. ఆ కూటమి డీఎంకే కూటమిని ఈ స్థాయిలో సవాలు చేయగలదని ఎవరూ అనుకోలేదు. రాష్ట్ర స్థాయిలో అన్నా డీఎంకేకు చెప్పుకోదగ్గ జనాకర్షణ కలిగిన నాయకులు లేకపోవడం, ఆ పార్టీ మాజీ సీఎంలు పళనిస్వామి, పన్నీరుసెల్వం మధ్య ఆధిపత్య పోరు యధా తథంగా వుండటం ఆ కూటమికి వున్న ప్రధాన సమస్యలు. అయితే ఆ అధిపత్య పోరును జయ ప్రదంగా అధిగమించి ఎన్నికలు ప్రకటించేనాటికి పార్టీకి ఏకైక నాయకుడిగా పళనిస్వామి తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. అయినా కూడా వరసగా పదేళ్లపాటు అధికారంలో వుండటం వల్ల అన్నాడీఎంకేపై ఆమేరకు జనంలో వ్యతిరేకత వుంది. బీజేపీ తన వాటాకింద 60 స్థానాలివ్వాలని పట్టుబట్టింది. కానీ కేవలం 20 సీట్లకు అది పరిమితమయ్యేలా అన్నాడీఎంకే ఒప్పించగలిగింది అలా వచ్చిన సీట్లలో కేవలం నాలుగు మాత్రమే అది గెలుచుకోగలిగింది. మరో పార్టీ పీఎంకే సైతం నాలుగు మాత్రమే సాధించింది. చివరకు ఎలాగైతేనేం ఆ కూటమి 66 స్థానాలు సాధించింది. తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని హిందుత్వ శక్తుల్ని కాలు పెట్టనీయరాదన్న డీఎంకే ఏకైక ఎజెండా పాత మిత్రులందరినీ శిబిరంనుంచి జారకుండా కాపాడింది. ఎన్నికల్లో కూడా డీఎంకే కూటమికి అదే ఉపయోగపడింది. దీంతోపాటు నీట్ పరీక్షలను కేంద్రం బలవంతంగా రుద్దిందన్న అభిప్రాయం ఏర్పడటం, జీఎస్టీ చిక్కుముడులు సైతం అన్నాడీఎంకే కూటమిని దెబ్బతీశాయి. ఫలితంగా జనం డీఎంకే కూటమికి భారీ మెజారిటీనిచ్చి అధికారాన్ని అప్పగించారు. నిజానికి సీట్ల పంపకాల్లో డీఎంకే కూటమి పక్షాల మధ్య కూడా బాగా విభేదాలు తలెత్తాయి. తాము కోరుకున్న సీట్లకూ, కేటాయించినవాటికీ ఎక్కడా పొంతన లేకపోవడంతో బీసీకే, ఎండీఎంకేవంటి చిన్న పక్షాలు మాత్రమే కాదు...కాంగ్రెస్, వామపక్షాలు సైతం డీఎంకేపై ఆగ్రహంతో వున్నాయి. అందుకే విజయం సాధించాక కూటమి సారథిని ప్రశంసించడానికి బదులు తమిళ ప్రజలను మాత్రమే ఆ పార్టీలు అభి నందించాయి. అయితే ఏమాటకామాటే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తనకు కేటాయించిన 25 స్థానాల్లో 17 మాత్రమే సాధించగలిగింది. అంతేకాదు... పుదుచ్చేరిలో ఆ కూటమి విజయం సాధించలేకపోయింది. అఖిల భారత ఎన్నార్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అసెంబ్లీలోని 30 స్థానాల్లో 16 గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అవసరమైన సంఖ్య కన్నా ఒకే ఒకటి అదనంగా వచ్చినా.. గెలిచిన ఆరుగురు స్వతంత్రుల్లో అత్యధికులు ఆయనకే మద్దతు పలుకుతారు గనుక సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సమస్యలేమీ వుండవు. తమిళనాట స్టాలిన్ ప్రభుత్వం ఆచితూచి అడుగులేయాల్సివుంటుంది. ఉదయభానుడిగుర్తుతో గతంలో పలు దఫాలు పాలించిన డీఎంకేకు పాలనానుభవం తక్కువేమీ లేదు. అయితే ఇన్నాళ్లూ అన్నాడీఎంకేకు సహకరించిన మాదిరి డీఎంకే కూటమి సర్కారుకు కేంద్రం సాయపడకపోవచ్చు. అందువల్ల ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో మునుముందు అనేక అవరోధాలను స్టాలిన్ అధిగమించాల్సివుంటుంది. అలాగే రోజుకు దాదాపు 15,000 కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో దాన్ని నియంత్రించడం కూడా ఆయనకు పెను సవాలే. జనాభాకు అవసరమైన కరోనా వ్యాక్సిన్లను కేంద్రం నుంచి సాధించడం, రోగుల సంఖ్యకు దీటుగా లేని బెడ్ల సంఖ్య పెంచడం స్టాలిన్ ముందున్న తక్షణ కర్తవ్యాలు. అయితే బెడ్లు పెంచినంత మాత్రాన సరిపోదు. అందుకు తగినట్టు వైద్యులనూ, నర్సింగ్ సిబ్బందిని కూడా నియమించాలి. ఈ తక్షణ, దీర్ఘకాలిక సవాళ్లను స్టాలిన్ ఎలా అధిగమిస్తారో, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎంత సమర్థవంతంగా నడుపుతారో మున్ముందు చూడాలి. -
దళపతి స్టాలిన్.. వేచి చూస్తున్న ముళ్ల కిరీటం
తమిళనాడులో డీఎంకేకి, దాని అధ్యక్షుడు ఎమ్కే స్టాలిన్‌కి మే 2వ తేదీ చాలాకాలంగా ఎదురుచూస్తున్న రోజు కావచ్చు. దాదాపు అయిదు దశాబ్దాలపాటు తనతండ్రి, డీఎంకే పితామహుడు ఎమ్. కరుణానిధి చాటున ఎదుగుతూ.. దళపతిగా మద్దతుదార్లు, కేడర్లు అభిమానంతో పిల్చుకునే స్టాలిన్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు గాను 160 స్థానాలు గెల్చుకున్న డీఎంకే కూటమి అధికార పీఠాన్ని దక్కించుకుంది. మోదీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టిన స్థితిలోనూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను ఒక్కటి మినహా అన్నింటినీ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే గెల్చుకున్న నేపథ్యంలో, అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. పైగా గత రెండేళ్లలో క్షేత్ర స్థాయిలో పెద్దగా మార్పులూ లేవు. కేంద్రం నుంచి బీజేపీ రిమోట్ కంట్రోల్‌కి అనుగుణంగా పనిచేస్తోందని అన్నాడీఎంకే ప్రభుత్వంపై ముద్రపడటంతో తమిళనాడులో అధికార మార్పిడి తప్పదని క్షేత్ర స్థాయి నివేదికలు తేటతెల్లం చేశాయి. జనంలో గూడుకట్టుకున్న ఈ అభిప్రాయాన్ని డీఎంకే మరింత శక్తివంతంగా ముందుకు తీసుకొచ్చి తమిళనాడు వ్యతిరేక విధానాలను కేంద్రం అమలు చేస్తోందని దాడి చేసింది. నీట్, రైతుల ఆందోళన, గెయిల్ హైడ్రో కార్బన్ ప్రాజెక్టు వంటి అంశాల విషయంలోనే కాకుండా జీఎస్టీ సుంకాలపై కేంద్రం వ్యవహారాన్ని కూడా డీఎంకే ఎండగట్టింది. ఈ సమస్యలన్నింటిపై స్టాలిన్ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తూ వచ్చారు. శాంతికి కేంద్రమే అసలు విలన్ అని, రాష్ట్రంలో ఈపీఎస్ ప్రభుత్వం కేంద్రం కీలుబొమ్మలా వ్యవహరిస్తూ పాలి స్తోందనే అవగాహనను ప్రజల్లో చొప్పించడంలో స్టాలిన్ విజయవంతమయ్యారు. తమ భాష, సంస్కృతి సుసంపన్నత పట్ల గర్వపడే తమిళ ప్రజలలో ఆత్మాభిమానాన్ని స్టాలిన్ ప్రేరేపించడమే కాకుండా భాషా సమస్యపై కూడా రాష్ట్ర ప్రజలను తనవైపు తిప్పుకున్నారు. అదే సమయంలో తన కూటమిలోని మిత్ర పక్షాలను తక్కువ స్థానాల్లో పోటీచేసేందుకు ఒప్పించిన స్టాలిన్ ఈ విషయంలో కఠినంగానే వ్యవహరించారు. స్టాలిన్ అభిమతాన్ని గౌరవించి 25 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన కాంగ్రెస్ 18 స్థానాల్లో గెలుపొందింది. డీఎంకే స్వయంగా 134 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని సొంతంగా ప్రభుత్వ స్థాపనకు కావలసిన మ్యాజిక్ సంఖ్యను దాటివేసింది. ఇంతకు మించి సుప్రసిద్ధ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం చేసుకోవాలని స్టాలిన్ తీసుకున్న కీలక నిర్ణయం ఆయనకు ఎంతగానో సహాయపడింది. పదేళ్లుగా అధికారం చలాయించిన అన్నాడీఎంకే ప్రభుత్వం పనితీరుతో విసిగిపోయి మార్పును కోరుకుంటున్న ప్రజారాశుల వద్దకు సరికొత్త ప్రచార శైలితో వచ్చిన డీఎంకే కేడర్ ఎంతో ఉత్సాహంతో తమ అధినాయకుడి తరపున ప్రచార కార్యక్రమాన్ని శక్తివంతంగా సాగించింది. రాజకీయంగా అత్యంత చైతన్యంతో ఉండే తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి, నాటి ముఖ్యమంత్రి జె జయలలిత మరణం తర్వాత ఏర్పడిన సంక్షోభ కాలం పొడవునా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి శక్తియుక్తులన్నింటినీ ప్రయోగించిన స్టాలిన్ ప్రతిఘటనా శక్తిని తమిళ ప్రజలు మర్చిపోలేదు. అయితే ఎన్నికల ద్వారానే అధికారాన్ని గెల్చుకోవడానికి ప్రాధాన్యమిచ్చిన స్టాలిన్ ఆ తరుణం కోసం వేచి ఉండి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తన శైలితో అధికార పీఠం దక్కించుకున్నారు. ఇప్పుడు స్టాలిన్ కోసం సింహాసనంపై ముళ్లకిరీటం ఎదురు చూస్తోంది. రాష్ట్రంలో పెచ్చరిల్లిపోతున్న కోవిడ్–19 మహమ్మారిని అరికట్టడమే తన ముందున్న సవాళ్లలో ప్రధానమైనది. పదవీబాధ్యతలు స్వీకరించక ముందే రాజకీయ పరిణతిని ప్రదర్శించి పాలనలో కొత్తదనం కోరుకుంటున్న స్టాలిన్.. కొత్త ప్రభుత్వానికి తన అనుభవాన్ని పంచిపెట్టడమే కాకుండా తగిన సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని అభ్యర్థించారు. పైగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజల ముంగిటకే తీసుకుపోతానని స్టాలిన్ ఇప్పటికే ప్రకటించేశారు. అన్నాడీఎంకే ముఖ్యమంత్రి ఇ. పళనిస్వామి కోవిడ్–19ని సమర్థంగా ఎదుర్కొన్నారు. పైగా సుపరిపాలన అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు కూడా. అయితే తన ప్రభుత్వం కేంద్రలోని బీజేపీ ప్రభుత్వానికి దాసోహమైపోయిందన్న వ్యతిరేక ప్రచారం ముందు ఆయన తన ప్రాముఖ్యతను కోల్పోయారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో స్టాలిన్ ఎలా వ్యవహరించనున్నారు అనేది ఆయనకు విషమ పరీక్షే. కేంద్రప్రభుత్వంపై, బీజేపీపై తీవ్రంగా వ్యతిరేక ప్రచారం చేసిన స్టాలిన్ ఇకపై ఏం చేయబోతారని ప్రజారాశులు నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపున కేంద్ర ప్రభుత్వంతో కార్యాచరణ సంబంధాన్ని స్టాలిన్ ఎలా నిర్మించుకుంటారో చూస్తానని అన్నాడీఎంకే ఎదురు చూస్తోంది. రాష్ట్రం ఇప్పటికీ రెండు గుర్రాల పరుగుపందేన్ని కొనసాగించనుందని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేశాయి. చిరకాలంగా తిష్ట వేసి కూచున్న ద్రవిడియన్ పార్టీలకు ముగింపు పలికి కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తామంటూ పలువురు చేసిన సుదీర్ఘ ప్రసంగాలు గాల్లో కలిసిపోయాయి. సూపర్ స్టార్ కమల్ హసన్ స్థాపించిన మక్కల్ నీతి మయ్యమ్ ఊసులోకూడా లేకుండా పోయింది. మరో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించినవాడై సకాలంలో ఎన్నికల రణరంగనుంచి తప్పుకున్నారు. రాజకీయరంగ ప్రవేశంపై ఎప్పటికప్పుడు సందేశాలు ఇస్తూ అభిమానులను అలరిస్తూ వచ్చిన రజనీ చివరికి అనారోగ్య కారణాలను సాకుగా చూపి రాజకీయ రంగం నుంచే తప్పుకోవడం మరీ విశేషం. లక్ష్మణ వెంకట కూచి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు -
156 స్థానాల్లో డీఎంకే కూటమి ఘనవిజయం
చెన్నై: తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న అన్నాడీఎంకే ఆశలు నెరవేరలేదు. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎంకే కూటమి 118 సీట్ల మెజారిటీ మార్క్‌ను సునాయాసంగా దాటేసి, 156 సీట్లను(ఆధిక్యంతో కలుపుకుని) గెల్చుకుంది. అన్నాడీఎంకే కూటమికి 78 సీట్లు(ఆధిక్యంతో కలుపుకుని) లభించాయి. పార్టీల వారీగా డీఎంకే 131, కాంగ్రెస్ 17, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే 70, పీఎంకే 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. డీఎంకే కూటమి 46.21% ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే కూటమి 40.14% ఓట్లు సాధించింది. చదవండి: (మరో వారసుడు రెడీ) జయ, కరుణానిధి లేకుండా.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల దిగ్గజ నాయకులు, దశాబ్దాలుగా తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కరుణానిధి, జయలలిత లేకుండానే ఈ ఎన్నికలు జరిగాయి. కరుణానిధి 2018లో, జయలలిత 2016లో మరణించిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం)’ కనీసం ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. స్వయంగా కమల్‌హాసన్ కోయంబత్తూర్ సౌత్ స్థానంలో ఓటమి పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ముఖ్యమంత్రి పళనిసామి సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బోదినాయకనూర్ నుంచి, డీఎంకే చీఫ్ స్టాలిన్ కోలత్తూర్ స్థానం నుంచి విజయం సాధించారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్– ట్రిప్లికేన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. డీఎంకే ఘనవిజయంతో పార్టీ శ్రేణులు, కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా, సంబరాల్లో మునిగితేలాయి.‘స్టాలిన్ థాన్ వారారు(స్టాలిన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు)’ అనే డీఎంకే ప్రచార గీతం హోరెత్తింది. డీఎంకే విజయం సాధించిన 2006లో డీఎంకే 96, డీఎంకే మిత్ర పక్షం కాంగ్రెస్ 34, అన్నాడీఎంకే 61 సీట్లు గెలుచుకున్నాయి. 2011, 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. చదవండి: (కమల్, దినకరన్, సీమాన్, కుష్బుకు తప్పని ఓటమి) డీఎంకేతోనే సంక్షేమం.. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గత దశాబ్ద కాలంగా డీఎంకే అధికారంలో లేదు. ఈ ఎన్నికల్లో ఘన విజయం అందించిన తమిళనాడు ప్రజలకు డీఎంకే చీఫ్, కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో డీఎంకే ఆరోసారి అధికారంలోకి రానుందన్నారు. డీఎంకే పాలనలోనే సంక్షేమం సాధ్యమని ప్రజలు విశ్వసించారని వ్యాఖ్యానించారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రతీక్షణం పాటుపడుతానన్నారు. గతంలో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు, తమిళనాడులో ఘనవిజయం సాధించిన డీఎంకేకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. అలాగే, ఎన్డీయేకు ఓటేసిన తమిళ ప్రజలకు, కూటమి విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
నాకెవ్వరూ పోటీ కాదు: స్టాలిన్
చెన్నై: కేంద్రంలో బీజేపీని మళ్లీ గద్దెనెక్కకుండా చేయడం, రాష్ట్రంలో అన్నాడీఎంకేను ఓడించడమే తమ లక్ష్యమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం మీడియాకు తెలిపారు. టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) దక్షిణ చెన్నై సెక్రెటరీగా వ్యవహరిస్తున్న వీపీ కళైరాజన్ ఈ రోజు మధ్యాహ్నం డీఎంకేలో చేరారు. తిరుచ్చిలో జరిగిన ఒక సభలో కళైరాజన్‌ను పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకే ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏఎంఎంకేతోపాటు వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. బీజేపీ, అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం తమతోనే సాధ్యమని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన కళైరాజన్ మాట్లాడుతూ ‘తమిళనాడును కాపాడే సత్తా, ద్రవిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తెగువ స్టాలిన్‌కే ఉన్నాయన్నారు. కళైరాజన్‌ను ఏఎంఎంకే నుంచి దినకరన్ బుధవారం బహిష్కరించారు. వీ సెంథిల్ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రెండో నేత కళైరాజన్. -
35 ఏళ్ల తర్వాత స్టాలిన్ తప్పుకున్నారు!
చెన్నై: తనకు ఎంతో ఇష్టమైన బాధత్యల నుంచి డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తప్పుకున్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా డీఎంకే యూత్ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన స్టాలిన్ ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆ స్థానాన్ని డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.పి. సామినాథన్‌కు కేటాయించారు. పార్టీ కోశాధికారిగా ఉన్న స్టాలిన్‌ను ఆయన తండ్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. డీఎంకే యూత్ విభాగాన్ని 1980-81 సమయంలో స్వయంగా స్టాలిన్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనూ ఆయన యూత్ వింగ్ పోస్టు నుంచి తప్పుకోవడానికి విముఖత చూపించారు. యూత్ విభాగం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సామినాథన్ పార్టీ చీఫ్ కరుణానిధిని కలిసి ధన్యావాదాలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేస్తానని, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన పేర్కొన్నారు. తిర్పూర్ జిల్లాలో అన్నాడీఎంకే దీటుగా డీఎంకేను అభివృద్ధి చేస్తానని చెప్పారు. పార్టీ నేత చంద్రశేఖర్‌ను యూత్ విభాగానికి జాయింట్ సెక్రటరీగా నియమించారు. -
'అయినా.. కలాం రాకెట్ సైంటిస్టే'
చెన్నై: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఒక అంతర్జిక్ష శాస్త్రవేత్త(రాకెట్ సైంటిస్ట్)గా డీఎమ్‌కే పార్టీ నేత ఎమ్.కె స్టాలిన్ అభివర్ణించారు. కలాం ఒక అసమానమైన నిజాయితీ, నిరాడంబరత, మేధస్సు కలిగిన మానవతావాదిగా ఆయన కొనియాడారు. క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ఇనుమడింపజేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన కలాంను రాకెట్ సైంటిస్ట్' గా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలాం బోధించిన విషయాలు యువత, పిల్లల్లో ఎంతో స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతిఒక్కరూ తమ కలను సాకారం చేసుకునేలా తోడ్పడ్డాయని చెప్పారు. ఇదిలా ఉండగా, డీఎమ్‌కే అధినేత ఎమ్. కరుణానిధి అబ్దుల్ కలాం గుండెపోటుతో మరణించారని తెలియగానే తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని తెలిపారు. తనకు కలాంతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. కలాం కుటుంబ సభ్యులకు, ఆయన శ్రేయోభిలాషులకు, భారత యువత తరపునా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు కరుణానిధి సందేశమిచ్చారు. -
స్టాలిన్ యూటర్న్
-
స్టాలిన్ యూటర్న్... రాజీనామా ఓ డ్రామా: ఆళగిరి
చెన్నై: డీఎంకే పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించిన ఆపార్టీ నేత, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ యూటర్న్ తీసుకున్నారు. స్టాలిన్ రాజీనామాతో చెన్నైలో హైడ్రామా నడించింది. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ హైకమాండ్ ఒత్తిడి మేరకు స్టాలిన్ యూటర్న్ తీసుకున్నారు. స్టాలిన్ రాజీనామా ఓ డ్రామా అని డిఎంకే పార్టీ బహిషృత నేత ఎంకే అళగిరి ఆరోపించారు. రాజీనామా ప్రకటించగానే స్టాలిన్ నివాసానికి పార్టీ అధినేత కరుణానిధి, సీనియర్ నేతలు చేరుకుని.. రాజీనామాను ఉపసంహరింప చేశారు. తమ ఒత్తిడి మేరకు రాజీనామాపై స్టాలిన్ మనసు మార్చుకున్నారని సీనియర్ నేత దురై మురుగన్ మీడియాకు తెలిపారు. -
పార్టీ పదవులకు స్టాలిన్ రాజీనామా!
-
పార్టీ పదవులకు స్టాలిన్ రాజీనామా!
చెన్నై: లోకసభ ఎన్నికల్లో పార్టీ దారుణమైన ఫలితాలను సాధించడానికి నైతిక బాధ్యత వహిస్తూ డీఏంకే కోశాధికారి, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. స్టాలిన్ తన పదవులకు రాజీనామా చేశారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత మీడియాకు వెల్లడించారు. తాజా లోకసభ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. తమిళనాడులో జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే పార్టీ 37 సీట్లు గెలుచుకోగా, బీజేపీ, పీఎంకే పార్టీలు చెరో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.