స్టాలిన్ యూటర్న్... రాజీనామా ఓ డ్రామా: ఆళగిరి
చెన్నై: డీఎంకే పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా సమర్పించిన ఆపార్టీ నేత, కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్ యూటర్న్ తీసుకున్నారు.
స్టాలిన్ రాజీనామాతో చెన్నైలో హైడ్రామా నడించింది. రాజీనామాను ఉపసంహరించుకోవాలని పార్టీ హైకమాండ్ ఒత్తిడి మేరకు స్టాలిన్ యూటర్న్ తీసుకున్నారు. స్టాలిన్ రాజీనామా ఓ డ్రామా అని డిఎంకే పార్టీ బహిషృత నేత ఎంకే అళగిరి ఆరోపించారు.
రాజీనామా ప్రకటించగానే స్టాలిన్ నివాసానికి పార్టీ అధినేత కరుణానిధి, సీనియర్ నేతలు చేరుకుని.. రాజీనామాను ఉపసంహరింప చేశారు. తమ ఒత్తిడి మేరకు రాజీనామాపై స్టాలిన్ మనసు మార్చుకున్నారని సీనియర్ నేత దురై మురుగన్ మీడియాకు తెలిపారు.