బీజేడీ శాసనసభాపక్ష నేతగా నవీన్ పట్నాయక్ | Naveen Patnaik elected BJD legislature party leader | Sakshi
Sakshi News home page

బీజేడీ శాసనసభాపక్ష నేతగా నవీన్ పట్నాయక్

Published Sun, May 18 2014 3:08 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

బీజేడీ శాసనసభాపక్ష నేతగా నవీన్ పట్నాయక్ - Sakshi

బీజేడీ శాసనసభాపక్ష నేతగా నవీన్ పట్నాయక్

భువనేశ్వర్: బిజు జనతాదళ్(బీజేడీ) శాసనసభాపక్ష నేతగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్నికయ్యారు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరుసగా నాలుగోసారి ఆయన సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నారు.

లోక్‌సభ ఎన్నికలతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని అధికార బీజేడీ వరుసగా నాలుగోసారి అధికార పీఠాన్ని దక్కించుకొని విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లకుగానూ మూడింట రెండొంతుల మెజారిటీతో 115 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 18, బీజేపీ 11, సమతా క్రాంతి దళ్ 1 సీటు గెలుచుకోగా రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement