ముంబై: ఓటర్లు ఈసారి అవినీతి కంటే కఠినమైన నిర్ణయాలు తీసుకునే దృఢమైన ప్రభుత్వం కావాలన్న ఉద్దేశంతోనే మోడీకి ఓటేశారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మయాంక్ గాంధీ పేర్కొన్నారు. నగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడిన మయాంక్.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటుచేసి 49 రోజుల్లోనే గద్దె దిగిపోవడంతో కేజ్రీవాల్ బాధ్యతల నుంచి తప్పించుకున్నారనుకున్న ప్రజలు అభిప్రాయపడ్డారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేదనుకున్న ఓటర్లు మోడీవైపు మొగ్గు చూపారని తెలిపారు. ఈసారి అవినీతి అనే అంశాన్ని ప్రజలు పట్టించుకోలేదని, అయినా కూడా అప్ అన్ని స్థానాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిందని చెప్పారు.
మోడీ, ఆయన పార్టీకి కార్పొరేట్ కంపెనీల నుంచి భారీగా నిధులు వచ్చాయని ప్రజలకు తెలిసినా అది పట్టించుకోలేదన్నారు. సమర్థ, నిర్ణయాత్మక ప్రభుత్వం కావాలనుకున్నా ఓటర్లు అది మోడీ వల్లనే సాధ్యమైనా బీజేపీని ఓటేశారని వివరించారు. ‘ఢిల్లీలో ఆప్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. కేంద్ర నాయకత్వం గురించే ప్రజలు బీజేపీకి ఓటేశారు. ఎప్పడూ ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఆప్ స్వీప్ చేస్తుంద’ని గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.