మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లిలో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది.
కల్వకుర్తి : మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లిలో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది. 119వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు కొనసాగనుంది. మరోవైపు రీ పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. కాగా ఈ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.