jupally
-
ప్రభుత్వం ప్రవేశపెట్టింది శ్వేతపత్రం కాదు ఫాల్స్ పేపర్: హరీష్
-
మై హోమ్ టర్నోవర్ రూ.6 వేల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్స్ట్రక్షన్, సిమెంట్, ఎంటర్టైన్మెంట్, ఫార్మా రంగాలలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైదరాబాద్‌కు చెందిన మై హోమ్ గ్రూప్.. మార్చితో ముగిసిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇందులో రూ.3 వేల కోట్లు కన్స్ట్రక్షన్స్, రూ.2,500 కోట్ల సిమెంట్.. మిగిలినవి ఎంటర్టైన్మెంట్, ఫార్మా విభాగాల వాటా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వృద్ధిని సాధిస్తామని పేర్కొంది. మై హోమ్ కంపెనీ ప్రారంభమై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారమిక్కడ మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మై హోమ్ ఎండీ జూపల్లి శ్యామ్ రావు మాట్లాడుతూ.. ఈ ఏడాది చివరి నాటికి 3.5 కోట్ల చదరపు అడుగులలో 25 ప్రాజెక్ట్‌లను డెలివరీ చేసిన ఘనతను సాధించనున్నామని.. ఇందులో ఇప్పటికే 2.7 కోట్ల చ.అ.లను డెలివరీ చేసేశామని.. మరొక 80 లక్షల చ.అ. నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. అనంతరం మైహోమ్ హోల్‌టైం డైరెక్టర్ జూపల్లి రాము రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం కోకాపేటలో 2.7 కోట్ల చ.అ.లలో ఆసియాలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రీకాస్ట్ కన్స్ట్రక్షన్, సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్‌లతో పాటు బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (బీఐఎం) 6డీ వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించనున్నామని చెప్పారు. అలాగే తెల్లాపూర్‌లో అంకుర పేరిట తొలి విల్లా ప్రాజెక్ట్‌ను, ఇదే ప్రాంతంలో త్రిదాస ప్రీమియం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లను కూడా నిర్మిస్తున్నామన్నారు. ఆయా ప్రాజెక్ట్‌లలో ప్రాజెక్ట్ విజిటింగ్ నుంచి ఫ్లాట్ బుకింగ్, లావాదేవీలు చెల్లింపులు అన్నింటినీ ఆన్లైన్లోనే చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోల్ టైం డైరెక్టర్ జూపల్లి వినోద్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ జూపల్లి రజితా రావు, సీఎఫ్ఓ ఏ శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. -
బరిలో తోడల్లుళ్లు.. జూపల్లిదే గెలుపు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ క్లీన్‌స్విప్ చేసింది. ఈ డివిజన్ నుంచి పోటీ చేసిన జూపల్లి సత్యనారాయణ విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూకట్‌పల్లికి చెందిన ‘మాధవరం’ ఇంటికి అల్లుళ్లు కావటం విశేషం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులుగా మాధవరం కుటుంబానికి అల్లుళ్లు కావటంతో పోటీ రసవత్తరంగా మారింది. బంధువుల మధ్యనే పోటీ నెలకొనడంతో ఎవరికి ప్రచారం చేయాలో, ఓటు ఎవరికి వేయాలో తేల్చుకోలేకపోయారు. చదవండి: గ్రేటర్ ఫలితాలు : గెలిచిన అభ్యర్థులు వీరే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాధవరం రామచంద్రరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మాధవరం కృష్ణారావు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. కూకట్పల్లి వెలమ సామాజిక వర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న మాధవరం కుటుంబ సభ్యులకు అల్లుళ్లుగా ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ, బీజేపీ అభ్యర్థి నాయినేని పవన్ కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి విశ్వ తేజేశ్వరరావులు కూకట్పల్లి వాస్తవ్యులే. అయినా ఓ విధంగా తోడల్లుళ్ల మధ్య పోరాటం సాగిందని చెప్పవచ్చు. చివరికి జూపల్లి సత్యనారాయణకే ఓటర్లు పట్టం కట్టారు. చదవండి: ఏఎస్రావు నగర్, ఉప్పల్‌లో కాంగ్రెస్ గెలుపు -
జూపల్లి సోదరుడు కుమార్తె వివాహానికి హాజరైన వైఎస్ జగన్
-
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఐకేపీ ఉద్యోగులకు సూచించారు. ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకోవడంతో సోమవారం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో ఐకేపీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ను సన్మానించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రెండ్లీ ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐకేపీ ఉద్యోగుల పోరాటం మరువలేనిదన్నారు. ఐకేపీ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలను సీఎం కేసీఆర్ పెంచినట్లు తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం చేసిన సమ్మెలో ఐకేపీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. మహిళా సంఘాలను కదిలించిన పాత్ర ఐకేపీ ఉద్యోగులదన్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ వెంకటయ్యగౌడ్, జెడ్‌ఎంఎస్ అధ్యక్షురాలు సలోమి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు సుదర్శన్, సక్రునాయక్, లక్ష్మయ్య, నాగమల్లిక, యాదగిరి, మహేష్, రాజప్ప, బాల్‌రాజు, ఈశ్వర్, అక్తర్, వెంకట్, సురేఖ పాల్గొన్నారు. -
'డీకే అరుణది దోచుకునే చరిత్ర'
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన చరిత్ర తమదైతే.. రాజకీయాల్లో దోచుకునే చరిత్ర డీకే అరుణదని ఆయన విమర్శించారు. డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిందే మంత్రి జూపల్లి కృష్ణారావు అని బాలరాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఆమెకు లేదని అన్నారు. ఇటీవల డీకే అరుణ సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డీకే అరుణ, జూపల్లి కృష్ణారావుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
'ఆప్కో అవకతవకలపై విచారణ'
హైదరాబాద్ : ఆప్కోలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, అందుకు కారణమైన వారిపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆయన గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ చేనేత ఉత్పత్తులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత ఉత్పత్తులకు సరైన సదుపాయాలు కల్పిస్తామని చేనేత కార్మికులకు మంత్రి హామీ ఇచ్చారు. -
జిల్లాకు పెద్దపీట
* కేసీఆర్ కేబినెట్లో జూపల్లి, లక్ష్మారెడ్డికి చోటు * నిరంజన్‌రెడ్డికి ప్రణాళిక సంఘం పదవి * పార్లమెంటరీ కార్యదర్శిగా శ్రీనివాస్‌గౌడ్ నియామకం * ఆశల పల్లకిలో మరికొందరు... సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కరువు జిల్లా పాలమూరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ పదవుల వర్షం కురిపించారు. మంగళవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డికి చోటు దక్కనుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు నూతనంగా సృష్టించిన పార్లమెంటరీ కార్యదర్శి హోదా దక్కింది. రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్ష పదవికి టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేరు ఖరారు చేశారు. కేబినెట్ హోదా కలిగిన పదవులు ఒకే విడత లో జిల్లాకు చెందిన నేతలకు దక్కడంతో రాబో యే రోజుల్లో మరిన్ని పదవులు ఖాయమని ఔత్సాహికులు లెక్కలు వేసుకుంటున్నారు. మంగళవారం జరిగే మంత్రివర్గ విస్తరణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), సి.లక్ష్మారెడ్డి (జడ్చర్ల) పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు అటు సీఎం కార్యాలయం, ఇటు రాజ్‌భవన్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కావస్తున్నా జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌ డ్ మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నిస్తూ వచ్చారు. వనపర్తి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన నిరంజన్‌రెడ్డి కూడా కీలక పదవిని ఆశిస్తూ వచ్చారు. తాజాగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో జిల్లా నుంచి పదవులు ఆశిస్తున్న నేతలు అందరినీ సంతృప్తి పరిచేలా సీఎం కేసీఆర్ పదవులు పంపిణీ చేశారు. మంత్రివర్గ విస్తరణకు ముందే మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు పార్లమెంటరీ కార్యదర్శి హోదా కట్టబెట్టారు. మంత్రి హోదాకు సమానమైన పదవిని కట్టబెట్టడం ద్వారా శ్రీనివాస్‌గౌడ్‌ను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలైనా ఎమ్మెల్సీగా నామినేట్ చేసి, మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు నిరంజన్‌రెడ్డి సన్నిహితులు చెబుతూ వచ్చారు. అయితే కేబినెట్ హోదా కలిగిన రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా నిరంజన్‌రెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పించారు. సామాజికవర్గాల లెక్కలు పక్కన పెట్టి మరీ జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసినట్లు సమాచారం. ఆశల పల్లకిలో మరికొందరు మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ వీడడంతో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న మరికొందరు నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, దేవర మల్లప్పకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, గద్వాల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణమోహన్‌రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులపై ఆశతో ఉన్నారు. -
కల్వకుర్తి నియోజకవర్గంలో రీ పోలింగ్
-
కల్వకుర్తి నియోజకవర్గంలో రీ పోలింగ్
కల్వకుర్తి : మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లిలో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది. 119వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు కొనసాగనుంది. మరోవైపు రీ పోలింగ్ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. కాగా ఈ కేంద్రంలో ఈవీఎం మొరాయించడంతో రీపోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
జూపల్లి 119 కేంద్రంలో రేపు రీ పోలింగ్
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ పాలమూరు, మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం జూపల్లి గ్రామంలోని 119వ పోలింగ్ కేంద్రంలో ఈనెల 19న రీ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశించిందని కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ శనివారం వెల్లడించారు. ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా ఓట్ల లెక్కింపు ఆగిపోయిది. ఇందుకుగాను ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 119వ పోలింగ్ కేంద్రం పరిధిలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. మొరాయించిన ఈవీఎంను పరిశీలించి తగిన చర్యలు చేపట్టేందుకు ఈసీఐఎల్‌కు చెందిన సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జెడ్.ఎ.ఖాన్, సీనియర్ ఇంజనీర్లు జైశ్వాల్ జిల్లా కేంద్రానికి వచ్చి కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ప్రవీణ్‌కుమార్ టోపో, కల్వకుర్తి నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులు వంశీచందర్‌రెడ్డి, టి.ఆచారి సమక్షంలో ఈవీఎంను పరిశీలించారు. ఈ విషయంలో పోలైన ఓట్లకు బదులు ఎర్రర్ చూపిస్తున్నందున విషయాన్ని ఎన్నికల సంఘానికి నివేదించారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం రీపోలింగ్ జరపాలని నిర్ణయించింది. కాగా, ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుండి అక్కడ ఎలాంటి ప్రచారం చేయకూడదు. దీంతో ఆ పోలింగ్ కేంద్రం పరిధిలో స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను, కేంద్ర ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పోలింగు కేంద్ర వివరాలు స్టేషన్ నెం: 119, జూపల్లి గ్రామం పోలింగు నిర్వహించాల్సిన ఓట్లు : 633 ప్రస్తుత ఆధిక్యం: వంశీచందర్ రెడ్డి (కాంగ్రెస్) -వచ్చిన ఓట్లు 42,229 - ఆధిక్యం 32 ఓట్లు ద్వితీయ స్థానం: టి.ఆచారి (బీజేపీ) - 42,197 తృతీయ స్థానం: జైపాల్‌యాదవ్ ( టీఆర్ఎస్)- 29,687 -
నకి‘లీల’ రట్టు
జూలపల్లి,న్యూస్‌లైన్: మండలంలో నకిలీ పట్టాదా రు పాస్‌పుస్తకాల వ్యవహారం వెలుగు చూసింది. బుధవారం స్థానిక తహశీల్దార్ వెంకటమాధవరా వు నకిలీ పాస్‌పుస్తకాలను గుర్తించారు. రామడుగు మండలం తిర్మలాపూర్‌కు చెందిన పాద భారతి జూలపల్లిలో భూమి కొనుగోలు చేయగా, కొందరు వ్యక్తులు ఆమెకు నకిలీ పాస్‌పుస్తకాలను అంటగట్టి న సంగతిని బయటపెట్టారు. తహశీల్దార్, ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేసి పుస్తకాలను ఇచ్చారని తేల్చారు. సదరు మహిళ కొనుగోలు చేసిన ఆరున్న ర గుంటల భూమి రికార్డుల్లో లేకపోవడంతో తహశీల్దార్‌ను కలిసి అడిగింది. దీంతో ఆయన ఆమె ఇచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పరిశీలించా రు. అధికారులు సంతకాలను పరిశీలించి ఫోర్జరీ అని చెప్పారు. విచారణ జరిపి నకిలీ పాస్‌పుస్తకాలను అంటగట్టిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తహశీల్దార్ తెలిపారు.