మండలంలో నకిలీ పట్టాదా రు పాస్‌పుస్తకాల వ్యవహారం వెలుగు చూసింది.
జూలపల్లి,న్యూస్‌లైన్: మండలంలో నకిలీ పట్టాదా రు పాస్‌పుస్తకాల వ్యవహారం వెలుగు చూసింది. బుధవారం స్థానిక తహశీల్దార్ వెంకటమాధవరా వు నకిలీ పాస్‌పుస్తకాలను గుర్తించారు. రామడుగు మండలం తిర్మలాపూర్‌కు చెందిన పాద భారతి జూలపల్లిలో భూమి కొనుగోలు చేయగా, కొందరు వ్యక్తులు ఆమెకు నకిలీ పాస్‌పుస్తకాలను అంటగట్టి న సంగతిని బయటపెట్టారు.
తహశీల్దార్, ఆర్డీవో సంతకాలను ఫోర్జరీ చేసి పుస్తకాలను ఇచ్చారని తేల్చారు. సదరు మహిళ కొనుగోలు చేసిన ఆరున్న ర గుంటల భూమి రికార్డుల్లో లేకపోవడంతో తహశీల్దార్‌ను కలిసి అడిగింది. దీంతో ఆయన ఆమె ఇచ్చిన పట్టాదారు పాస్‌పుస్తకాలను పరిశీలించా రు. అధికారులు సంతకాలను పరిశీలించి ఫోర్జరీ అని చెప్పారు. విచారణ జరిపి నకిలీ పాస్‌పుస్తకాలను అంటగట్టిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తహశీల్దార్ తెలిపారు.