
'ఆప్కో అవకతవకలపై విచారణ'
ఆప్కోలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, అందుకు కారణమైన వారిపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
హైదరాబాద్ : ఆప్కోలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి, అందుకు కారణమైన వారిపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలంగాణ పరిశ్రమల శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆయన గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చేనేత కార్మికులకు శిక్షణ ఇచ్చి, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ చేనేత ఉత్పత్తులు వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత ఉత్పత్తులకు సరైన సదుపాయాలు కల్పిస్తామని చేనేత కార్మికులకు మంత్రి హామీ ఇచ్చారు.