సాక్షి, రంగారెడ్డి జిల్లా : సార్వత్రిక ఎన్నికల్లో కారు రయ్‌మంటూ దూసుకెళ్లింది. జిల్లాలో పెద్దగా ప్రభావం లేని ఆ పార్టీ.. తాజాగా జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా బలపడి సత్తాచాటింది. మునుపెన్నడూ లేనంతగా.. అత్యధికంగా ఓట్లు సాధించి బలమైన పార్టీగా అవతరించింది. గత ఎన్నికల కంటే 22.27శాతం ఓట్లు అధికంగా సాధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే పార్టీలవారీగా వచ్చిన ఓట్లలో తెలుగుదేశం పార్టీ ముందువ రుసలో ఉండగా.. తెలంగాణ రాష్ట్ర సమితి రెండో స్థానంలో నిలిచింది.
జిల్లాలో గత రెండు సాధారణ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్ల శాతం (2009 ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాల్లో పోటీ చేయగా, 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా 4 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది.) జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 8 సీట్లు కైవసం చేసుకోగా టీఆర్‌ఎస్ 4 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4స్థానాల్లో ‘కారు’దే జోరు పోటీ చేయగా ఒక సీటును సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 2సీట్లతో సరిపెట్టుకుంది. ఓట్ల పరంగా టీడీపీ మొదటి స్థానంలో ఉంది. టీఆర్‌ఎస్ ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి తాజా ఎన్నికలు చెంపపెట్టుగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేకత.. దీనికితోడు పార్టీలో గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఈసారి 9.16శాతం ఓట్లు తగ్గి సీట్ల సంఖ్య భారీగా పడిపోయింది. టీడీపీకి ఈసారి సీట్ల సంఖ్య పెరిగినప్పటికీ ఓట్లు 1.46 శాతం మాత్రమే పెరిగాయి.
తెలంగాణ రాష్ట్రసమితి అనూహ్యంగా బలపడింది. తెలంగాణ సెంటిమెంటు, దానికితోడు ప్రముఖ నేతలంతా పార్టీలో చేరి పోటీచేయడంతో కారుజోరు పెరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు ఓట్ల శాతం భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో 6.64శాతం ఓట్లు సాధించగా.. తాజా ఎన్నికల్లో 28.92శాతం ఓట్లు పోలయ్యాయి. ఏకంగా 22.27 శాతం ఓట్లు పెరగడం విశేషం. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ సైతం బలపడింది. నాలుగుస్థానాల్లో పోటీ చేసి ఒక సీటు సాధించింది. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి 6.86శాతం ఓట్లు రాగా.. ఈసారి కేవలం నాలుగు స్థానాల్లో పోటీ చేయగా 5.92శాతం ఓట్లు వచ్చాయి.
‘కారు’దే జోరు
Published Tue, May 20 2014 12:12 AM | Last Updated on Sat, Aug 11 2018 4:48 PM
Advertisement