నిజామాబాద్ అర్బన్,న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడంతో శుక్రవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. గెలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఆయా నియోజక వర్గాల్లో భారీగా విజయోత్సవ ర్యాలీలు చేపట్టారు. కార్యకర్తలు ఆనందోత్సహంతో టపాకాయలు కాల్చుతూ నృత్యాలు చేస్తూ ర్యాలీలు చేపట్టారు.
సీఎంసీ నుంచి ర్యాలీగా..
నిజామాబాద్ లోక్‌సభ ఎంపీగా గెలిచిన కవిత, రూరల్,అర్భన్ అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్ , బిగాల గణేష్‌గుప్తలు సీఎంసీ నుంచి ర్యాలీ ప్రారంభించారు. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నగరంలోని పులాంగ్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు డిచ్‌పల్లిలో నిజామాబాద్ రూరల్ నుంచి గెలుపొందిన బాజిరెడ్డి గోవర్ధన్ ఖిల్లా రామాలయంలో పూజలు చేసి డిచ్‌పల్లిలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలువేశారు. అనంతరం మండల కేంద్రంలో టపాకాయలు కాల్చి ర్యాలీ చేపట్టారు.
నియోజక వర్గంలోని ఆయా గ్రామాల్లో కూడా టీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కామారెడ్డిలోని గంప గోవర్ధన్ తన కార్యకర్తలు, నాయకులతో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఆయా గ్రామాల్లో కూడా టీఆర్‌ఎస్ శ్రేణులు టపాకాయలు కాల్చుతూ ఆనందం వ్యక్తం చేశాయి. ఆర్మూర్ నియోజక వర్గంలోని ఎ.జీవన్‌రెడ్డి, ఆర్మూర్ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. మాక్లూర్, నందిపేట మండల కేంద్రాల్లో కూడా టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. జుక్కల్‌లోని హన్మంత్‌సింధే రాత్రి భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ తీశారు. బాల్కొండలోని ఆయా గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడా టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు విజయోవత్సవ ర్యాలీలు చేపట్టి, స్వీట్లు పంచుకున్నారు. వేల్పూర్‌లో వేముల ప్రశాంత్‌రెడ్డికి ఘన స్వాగతం పలి కారు. బోధన్‌లో షకీల్ తన కార్యకర్తలతో అంబేద్కర్ చౌరస్తాలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఎల్లారెడ్డిలోని ఏనుగు రవీందర్‌రెడ్డి విజయోత్సవ ర్యాలీ తీశారు. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
టీఆర్‌ఎస్ సంబురాలు
Published Sat, May 17 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 7:26 AM
Advertisement