రాజ్ నాథ్ ను కలిసిన పీఏ సంగ్మా | PA Sangma reaches Rajnath Singh's residence | Sakshi
Sakshi News home page

రాజ్ నాథ్ ను కలిసిన పీఏ సంగ్మా

Published Sun, May 18 2014 2:05 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

రాజ్ నాథ్ ను కలిసిన పీఏ సంగ్మా - Sakshi

రాజ్ నాథ్ ను కలిసిన పీఏ సంగ్మా

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిదోసారి విజయం సాధించిన మాజీ లోకసభ స్పీకర్, నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత, పీఏ సంగ్మా..బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ఆయన నివాసంలో కలిశారు.
 
కేబినెట్ కూర్పు కు సంబంధించిన వ్యవహారాలు దేశరాజధానిలో ఊపందుకున్న తరుణంలో రాజ్ నాథ్ ను సంగ్మా కలువడం ప్రధాన్యత సంతరించుకుంది. కేబినెట్ లో చోటు కల్పించాలని రాజ్ నాథ్ ను సంగ్మా కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. 
 
షిల్లాంగ్ లోని తురా లోకసభ నియోజకవర్గం నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి విన్సెంట్ హెచ్ పాలాపై 40 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
 
1972 సంవత్సర నుంచి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు లోకసభ అభ్యర్ధిగా గెలిచిన చరిత్ర సంగ్మా పేరిట ఉంది. 1989, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement