ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు ...
కాన్పూర్: బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ కూటమి 300 సీట్లకు పైగా గెలుచుకుంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్ డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
మే 16న జరిగే ఎన్నికల ఫలితాలు, ఓట్ల లెక్కింపు, ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి ఆర్ఎస్ఎస్ నేతలతో రాజనాథ్ సింగ్ భేటి అయ్యారు.
ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు. సాధారణ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు తెలిపిన ఆర్ఎస్ఎస్ కు కృతజ్ఞతలు ఆయన తెలిపారు.