'ప్రజలు మార్పు కోరుకుంటున్నారు'
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ: ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ అన్నారు. పూర్తి మెజారిటీతో ఉన్న ప్రభుత్వం కోసం ప్రజలు చూస్తున్నారని ఆయన అన్నారు. అందుకే భారీ సంఖ్యలో పోలింగ్ నమోదవుతుందని రాజ్ నాథ్ తెలిపారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ నాయకత్వంలో పూర్తి మెజారిటీతో కూడిన బీజేపీ-ఎన్ డీఏ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
ఎన్నడూ లేనంతగా 2014లో అత్యధికంగా పోలింగ్ నమోదవుతుందని, పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకే ప్రజలు నిర్ణయించుకున్నారని రాజ్ నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్ డీఏ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని.. దేశాన్ని అత్యున్నత స్థానానికి తీసుకువెళుతామన్నారు. భారత దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2014 సాధారణ ఎన్నికల్లో 66.38 శాతం పోలింగ్ నమోదైంది.