అసలైన అభ్యర్థి తానేనని రాజ్‌నాథ్ ప్రచారం: లాలూ | Rajnath Singh projecting himself as candidate for top job: Lalu Prasad Yadav | Sakshi
Sakshi News home page

అసలైన అభ్యర్థి తానేనని రాజ్‌నాథ్ ప్రచారం: లాలూ

Published Fri, May 2 2014 10:53 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

అసలైన అభ్యర్థి తానేనని రాజ్‌నాథ్ ప్రచారం: లాలూ - Sakshi

అసలైన అభ్యర్థి తానేనని రాజ్‌నాథ్ ప్రచారం: లాలూ

పాట్నా: బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీకి బదులుగా ఆయన పేరును ప్రచారం చేసుకుంటున్నారని ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అంటే లాలూకు భయమన్న రాజ్‌నాథ్ వ్యాఖ్యలను ఖండించారు. ‘ప్రధాని పదవికి తానే నిజమైన అభ్యర్థినని రాజ్‌నాథ్ తన వర్గానికి చెందిన రాజపుత్రులకు చెబుతున్నారు. బీజేపీకి ఓట్లను రాబట్టేందుకు ఇలాంటి ఎత్తుగడ వేస్తున్నారు’ అని లాలూ ఆరోపించారు.

తెలివైన బీహార్ ప్రజలను ఎవరూ మోసగించలేరన్నారు. రాజ్‌నాథ్ ఆరెస్సెస్ చేతిలో చిలక లాంటి వారని చెప్పారు. సమాజ్‌వాదీ అధ్యక్షుడు ములాయం, బీఎస్సీ అధ్యక్షురాలు మాయావతి దళితుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. అయితే లాలు వ్యాఖ్యలను బీజేపీ సీనియర్ నేత షానవాజ్ హుస్సేన్ తిప్పికొట్టారు. నిజానికి లాలూనే కాంగ్రెస్ చేతిలో చిలక లాంటి వారని చెప్పారు. లాలూను జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీ వారికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసేందుకు విడుదల చేసిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement