PA Sangma
-
మాజీ స్పీకర్ సంగ్మా కన్నుమూత
గుండెపోటుతో మృతి * పార్లమెంట్ ఉభయ సభల్లో నివాళి * గొప్ప నేతను కోల్పోయామన్న ప్రణబ్, మోదీ, సోనియా న్యూఢిల్లీ: లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా(68) గుండెపోటుతో శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలో మృతిచెందారు. మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన మేఘాలయలోని తుర నుంచి 9 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. సంగ్మాకు భార్య సరోదిని, కుమారులు కాన్రడ్, జేమ్స్‌లతో పాటు కుమార్తె అగథాలు ఉన్నారు. నివాళిగా లోక్‌సభను ఒకరోజుపాటు వాయిదా వేయగా.... ప్రొటొకాల్‌ను పక్కనపెట్టి రాజ్యసభను లంచ్ విరామం తర్వాత వాయిదా వేశారు. రాజకీయ ప్రస్థానం: సెప్టెంబర్ 1, 1947న జన్మించిన సంగ్మా 1980-88 మధ్య కేంద్రంలో సహాయమంత్రిగా పనిచేశారు. పీవీ కేబినెట్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1996-98కాలంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారు. సోనియా విదేశీయతను ప్రశ్నించడంతో 1999లో కాంగ్రెస్ నుంచి బహిష్కృతడయ్యారు. శరద్‌పవార్, తారిక్ అన్వర్లతో కలిసి ఎన్సీపీని స్థాపించారు. 2004లో ఎన్సీపీ నుంచి బయటకొచ్చి తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి నేషనలిస్ట్ తృణముల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. కొన్నాళ్లకు ఆ పార్టీ నుంచి తప్పుకుని నేషనల్ పీపుల్స్ పార్టీని స్థాపించి ప్రస్తుతం ఆ పార్టీ నుంచే లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2012లో ప్రణబ్‌ముఖర్జీపై బీజేపీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీపడ్డారు. 1988 నుంచి 90 వరకూ మేఘాలయ సీఎంగా పనిచేశారు. ప్రముఖుల నివాళి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి సంగ్మా కృషి ఎంతో గొప్పదని ప్రధాని ట్విట్టర్లో కొనియాడారు. దేశం బహుముఖ ప్రజ్ఞాశాలిని కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. గొప్పవ్యక్తిని, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన గొంతును పొగొట్టుకున్నామంటూ సోనియా సంతాపం తెలిపారు. రాజస్థాన్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు సీఎంలుసహా పలువురు ప్రముఖులు సంగ్మా మృతికి సంతాపం తెలిపారు. మేఘాలయలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంతాపం హైదరాబాద్: సంగ్మా మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రగాఢ సంతాపం తె లిపారు. గొప్ప పార్లమెంటేరియన్ అని, ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. -
'త్వరలోనే తెలంగాణలో రాజకీయ శూన్యత'
హైదరాబాద్: 'నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలు కోల్పోతున్నది. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితమైపోయింది. బలపడే అవకాశాలున్నా బీజేపీ వేళ్లూనుకోలేకపోతున్నది. ఇక అధికార టీఆర్ఎస్ తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన రాజకీయపార్టీలు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి.. త్వరలోనే రాజకీయ శూన్యతకు దారితీస్తుంది' అని లోక్ సభ మాజీ స్పీకర్ పీఏ సగ్మా జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించేందుకే ఇక్కడికి వచ్చానని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ వచ్చిన పీఏ సంగ్మా.. హెచ్ సీయూలో విద్యార్థి వేముల రోహిత్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. శరద్ పవార్(ఎన్సీపీ) నుంచి విడిపోయిన తర్వాత తాను స్థాపించిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్ పీపీ) ఇంకా గుర్తింపు పొందనప్పటికీ జాతీయ పార్టీగా ఎదుగిందన్న సగ్మా.. తెలంగాణకు చెందిన పలువురు నేతలు తనతో టచ్ లో ఉన్నారని, ఇక్కడి రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తునే ఉన్నానని చెప్పారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి మౌళిక అంశాలపై టీఆర్ఎస్ దృష్టి పెట్టడంలేదని, ఉద్యమం ద్వారా సాధించుకున్న తెలంగాణలో 1500 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని సగ్మా అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుకాబోయే నూతన రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక.. అట్టడుగు వర్గాలకు మేలు చేసేలా, సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తుందని సంగ్మా భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్, గాదె ఇన్నయ్య, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, గాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచారాన్ని అడ్డుకుందని.. చంపేశారు
-
మాట వినలేదని మహిళ తలను రెండు చెక్కలు చేసిన ఉగ్రవాదులు
ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉగ్రవాదులు బలాత్కారాన్ని ప్రతిఘటించిన ఒక మహిళను ఆమె భర్త, పిల్లల ముందే అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ ఘోరం మంగళవారం రాత్రి జరిగింది. గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అయిదుగురు ఉగ్రవాదులు మేఘాలయలోని రాజా రంగత్ గ్రామంలో ఒక ఇంట్లోకి చొరబడ్డారు. భర్త, పిల్లలన ఒక గదిలో బంధించి, మహిళను బలాత్కరించడానికి ప్రయత్నించారు. ఆమె దానికి తీవ్రంగా ప్రతిఘటించడంతో మెషీన్ గన్ తో ఆమె తలపై దగ్గర నుంచి కాల్చారు. దీంతో ఆమె తల రెండు చెక్కలై అక్కడికకక్కడే చనిపోయింది. ఈ సంఘటనను ఎంపీ, లోకసభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా తీవ్రంగా ఖండించారు. మేఘాలయలో ఇలాంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ జరగలేదని ఆయన అన్నారు. గారో జాతి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న గారో ఉగ్రవాదులు గారో ప్రజలనే కాల్చి చంపడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
రాజ్ నాథ్ ను కలిసిన పీఏ సంగ్మా
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిదోసారి విజయం సాధించిన మాజీ లోకసభ స్పీకర్, నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత, పీఏ సంగ్మా..బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను ఆయన నివాసంలో కలిశారు. కేబినెట్ కూర్పు కు సంబంధించిన వ్యవహారాలు దేశరాజధానిలో ఊపందుకున్న తరుణంలో రాజ్ నాథ్ ను సంగ్మా కలువడం ప్రధాన్యత సంతరించుకుంది. కేబినెట్ లో చోటు కల్పించాలని రాజ్ నాథ్ ను సంగ్మా కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. షిల్లాంగ్ లోని తురా లోకసభ నియోజకవర్గం నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి విన్సెంట్ హెచ్ పాలాపై 40 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1972 సంవత్సర నుంచి ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు లోకసభ అభ్యర్ధిగా గెలిచిన చరిత్ర సంగ్మా పేరిట ఉంది. 1989, 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు.