నిజామాబాద్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండేది ఇంకా నాలుగు నెలలేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పడబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఆదివారం కల్వరాల్, సదాశివనగర్ మండల కేంద్రంలో వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతుల కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అతివృష్టి వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.
నష్టాన్ని చూసి బాధిత రైతుల కంటతడి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 50 వేల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు లకు పరిహారం చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబందు పేరుతో ఎకరాకు రూ. 5 వేలు ఇస్తూ ఇతర పథకాలను ఎత్తివేసిందన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, మండలాధ్యక్షుడు నర్సింరెడ్డి, ఎంపీటీసీలు మహిపాల్ యాదవ్, భైరవరెడ్డి, నా యకులు పైళ్ల కృష్ణారెడ్డి, పొతంగల్ కిషన్‌రావు, కొప్పుల గంగారెడ్డి, మర్రి రాంరెడ్డి, సురేందర్‌రెడ్డి, మార రమేశ్‌రెడ్డి, నర్సారెడ్డి, స్వామి గౌడ్, గంగాధర్‌రావు, భూంరావ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment