న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం పలువురు బీజేపీ నాయకులతో మోడీ సమావేశమయ్యారు. మోడీ సన్నిహితుడు అమిత్ షా, ప్రధాన కార్యదర్శి జేపీ నద్దా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీహార్ ఇన్చార్జి ధర్మేంద్ర ప్రధాన్లతో ఆయన చర్చలు సాగించారు.
బీహార్లో ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేసిన నేపథ్యంలో తలెత్తిన రాజకీయ పరిస్థితులపై కూడా దృష్టిసారించారు. బీహార్లో పరిస్థితిపై వేచిచూడాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. కాగా ఈనెల 20న మోడీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు తమ నాయకుడిగా ఎన్నుకోనుంది.
బీజేపీ నేతలతో మోడీ చర్చలు
Published Sun, May 18 2014 11:52 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement