
సాక్షి, అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలోని కోవ్వూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కొవ్వూరు టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తొలిరోజే మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్థానికులకు కాకుండా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితకు కొవ్వూరు టికెట్ ఇవ్వడంపై టీవీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవ్వూరు టికెట్‌ను తన కూతురికి కేటాయించాలని చంద్రబాబును టీవీ కోరారు. కానీ చంద్రబాబు ఆమెను కాదని అనితకు ఇచ్చారు. దీంతో అసంతృప్తి చెందిన టీవీ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు తనకు చేసిన అన్యాయానికి నిరసనగా టీడీపీకి రాజీనామా చేస్తున్నానని రామారావు ప్రకటించారు. భవిష్యత్తు కార్యాచరణపై తన అనుచరులతో సమావేశమయ్యారు.
గుంటూరులోనూ అదే పరిస్థితి
గుంటూరు జిల్లా టీడీపీలోనూ అసమ్మతి నేతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. మాచర్ల టికెట్‌ను అంజిరెడ్డికి ప్రకటించడం పట్ల చలమారెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్టీ ఆఫీసు వద్ద చలమారెడ్డి వర్గం ధర్నాకు దిగారు. చలమారెడ్డి ముద్దు.. అంజిరెడ్డి వద్దూ అంటూ నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారిని కాదని, కొత్తవారికి టికెట్ ఇవ్వడం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. స్థానికులకు నచ్చని అభ్యర్థిని ప్రకటిస్తే కచ్చితంగా ఓడిస్తామని హెచ్చరించారు.ఇక కర్నూలు జిల్లా బనగాణపల్లేలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. బుడ్డా రాజశేఖర్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డిలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఓటమి భయంతో బీసీ వెనుకంజ వేస్తున్నారు. బీజీ జనార్దన్ రెడ్డి సొంతగ్రామంలో 100 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment