మావోయిస్టుల ప్రభావితం అధికంగా ఉన్న మాచర్లలో పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు మాచర్ల ఇన్ఛార్జ్ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
గుంటూరు : మావోయిస్టుల ప్రభావితం అధికంగా ఉన్న మాచర్లలో పోలింగ్కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు మాచర్ల ఇన్ఛార్జ్ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ పోలింగ్కు 1000 భద్రత సిబ్బందిని నియమించామన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 245 ఉండగా,...వాటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 236 ఉన్నాయన్నారు.
అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 129 ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. మావోయిస్టు, ఫ్యాక్షన్ గ్రామాలు అధికంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరింపచేసామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి మూడు కంపెనీల అదనపు బలగాలను రప్పించినట్లు తెలిపారు.