sp chandra shekar reddy
-
నందిపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు
ఓ వర్గం మహిళను వేధించిన మరో వర్గం యువకులు నందిపేట : నిజామాబాద్ జిల్లా నందిపేటలో శనివారం ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. నందిపేటకు చెందిన ఓ మహిళ నవీపేట మండలం జన్నెపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. నాలుగు రోజుల నుంచి నందిపేటకు చెందిన ఓ వర్గం యువకులు సదరు మహిళను వేధిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలపడంతో స్నేహితులతో కలిసి వేధించిన యువకుల కోసం శుక్రవారం రాత్రి నుంచి గాలించారు. శనివారం ఉదయం వారు దొరకగా.. చితక బాదారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో ఎస్సై జాన్‌రెడ్డి సృ్పహ తప్పి పడిపోయాడు. దీంతో స్థానికులు ఆయనకు స్థానిక ప్రైవేట్ వైద్యుడితో వైద్యం చేయించారు. గణపతి ఉత్సవాల్లో నైట్ డ్యూటీతో నిద్ర సరిగా లేకపోవడంతోనే బీపీ తక్కువై ఎస్సై జాన్‌రెడ్డి కింద పడిపోయినట్లు ఆ వైద్యుడు తెలిపారు. మహిళపై వేధింపులకు నిరసనగా ఓ వర్గం యువకులు నందిపేటలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో మహిళను వేధించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వర్గం వారంతా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆందోళన చేశారు. కాగా, ఈ ఘర్షణల విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ చంద్రశేఖర్‌రె డ్డి నందిపేటలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
మాచర్లలో పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత
గుంటూరు : మావోయిస్టుల ప్రభావితం అధికంగా ఉన్న మాచర్లలో పోలింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు మాచర్ల ఇన్ఛార్జ్ ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ పోలింగ్‌కు 1000 భద్రత సిబ్బందిని నియమించామన్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 245 ఉండగా,...వాటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 236 ఉన్నాయన్నారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 129 ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. మావోయిస్టు, ఫ్యాక్షన్ గ్రామాలు అధికంగా ఉన్న పల్నాడు ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరింపచేసామని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి మూడు కంపెనీల అదనపు బలగాలను రప్పించినట్లు తెలిపారు.