వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి | Postpartum died due to doctor's negligence | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యానికి బాలింత బలి

Published Wed, Nov 18 2015 3:47 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

Postpartum died due to doctor's negligence

మాచర్ల: గుంటూరుజిల్లా ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి ఓ బాలింత మృతి చెందింది. మాచర్ల మండలం బైరనిపాడు గ్రామానికి చెందిన బత్తుల సంధ్యారాణి (20)ని కాన్పు కోసం కుటుంబసభ్యులు బుధవారం తెల్లవారుజామున మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు రక్తస్రావం అవుతున్నా పట్టించుకోలేదు.

రక్తస్రావం ఆగక సంధ్యారాణి ఆరోగ్యం విషమిస్తుండడంతో మధ్యాహ్నం సమయంలో ఆమెను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్‌లో తరలించే చర్యలు చేపట్టారు. అయితే, అంబులెన్స్ నర్సారావుపేటకు చేరుకుంటున్న సమయంలో సంధ్యారాణి మృతి చెందింది. బాధితురాలి బంధువులు ఆందోళనకు వస్తున్నారన్న సమాచారంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించి.. తమ గదులకు తాళాలు వేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. నవజాత శిశువు వారోత్సవాల సమయంలో ఇలాంటి ఘటన జరగడం ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనం మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement