విజయపురిసౌత్ (మాచర్ల): పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు లాంచీ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. విజయపురిసౌత్ లోని లాంచీస్టేషన్ నుంచి జలవనరుల శాఖ ఏఈఈ కేవీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం నాగసిరి లాంచీని ప్రారంభించారు. కొండలో విధులు నిర్వహించే 30 మంది ఉద్యోగులతో నాగసిరి లాంచీ కొండకు వెళ్లింది. రెండేళ్లుగా కోవిడ్, భద్రతా కారణాలతో నాగార్జునకొండకు లాంచీ సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
చదవండి: కోడె ధర రూ.2 లక్షలు
రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రత నడుమ లాంచీలు నాగార్జునకొండకు తిప్పేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు పురావస్తుశాఖ సిబ్బంది కొండపై పిచ్చి మొక్కలను, ముళ్ల చెట్లను తొలగించి శుభ్రం చేయనున్నారు. అనంతరం పర్యాటకులను లాంచీల ద్వారా కొండకు చేరవేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment