Nagarjunakonda
-
నాగార్జునకొండకు లాంచీలు ప్రారంభం
నాగార్జునసాగర్: బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జునకొండకు శనివారం నుంచి లాంచీలు మొదలయ్యాయి. తెలంగాణ నుంచి 60 మంది పర్యా టకులతో మొదటి లాంచీ నాగార్జునకొండకు వెళ్లింది. 28 నెలల తర్వాత లాంచీలు వెళ్లడం తో నాగార్జునకొండను చూడాలని పర్యాటకు లు తహతహలాడారు. కొండకు లాంచీలు లేని సమయంలో ట్రిప్పులు వేసేవారు. ఇప్పుడు నాగార్జునకొండకు చేరుకోవాలంటే నీటిలో గంటసేపు లాంచీ ప్రయాణం చేయాల్సి ఉంది. అక్కడ గంటసేపు మ్యూజియం తదితర ప్రాం తాలను సందర్శించే వీలుంటుంది. కొండకు లాంచీలు నడుస్తుండటంతో విదేశీ బౌద్ధమత యాత్రికుల రాకపోకలు కొనసాగనున్నాయి. ఇప్పుడు నాగార్జునసాగర్‌కు వస్తే బౌద్ధస్తూ పం కలిగిన శ్రీపర్వతారామం, బుద్ధవనం సం దర్శించే వీలు కలుగుతుంది. త్వరలో బుద్ధవనాన్ని సీఎం ప్రారంభించే అవకాశాలున్నా యని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. -
నాగార్జునకొండకు ప్రారంభమైన లాంచీ సర్వీసులు
విజయపురిసౌత్ (మాచర్ల): పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు లాంచీ సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. విజయపురిసౌత్ లోని లాంచీస్టేషన్ నుంచి జలవనరుల శాఖ ఏఈఈ కేవీ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం నాగసిరి లాంచీని ప్రారంభించారు. కొండలో విధులు నిర్వహించే 30 మంది ఉద్యోగులతో నాగసిరి లాంచీ కొండకు వెళ్లింది. రెండేళ్లుగా కోవిడ్, భద్రతా కారణాలతో నాగార్జునకొండకు లాంచీ సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. చదవండి: కోడె ధర రూ.2 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రత నడుమ లాంచీలు నాగార్జునకొండకు తిప్పేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు పురావస్తుశాఖ సిబ్బంది కొండపై పిచ్చి మొక్కలను, ముళ్ల చెట్లను తొలగించి శుభ్రం చేయనున్నారు. అనంతరం పర్యాటకులను లాంచీల ద్వారా కొండకు చేరవేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
నాగార్జునకొండలో విదేశీయుల సందడి
విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండలో ఆదివారం 40 మంది విదేశీ విద్యార్థులు సందడి చేశారు. వీరు శాంతిసిరి లాంచీలో కొండకు చేరుకుని మ్యూజియంతో పాటు మాన్యుమంట్స్‌ను తిలకించారు. అనంతరం సాగర్ చేరుకుని అనుపు, ఎత్తిపోతల జలపాతాలు వీక్షించారు. యెమన్, సుడాన్, సోమాలియా, సౌదీఆరేబియా దేశానికి చెందిన విద్యార్థులు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. -
నాగార్జునకొండకు ఈ–టికెటింగ్ ప్రారంభం
విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను సందర్శించే పర్యాటకులు ఈ– టిక్కెటింగ్ పొందేందుకు స్థానిక లాంచీస్టేషన్లో సోమవారం కౌంటర్‌ను హైదరాబాద్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ అనీల్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని అన్ని మ్యూజియమ్స్ సందర్శించేందుకు ఈ కౌంటర్ ద్వారా సులభతరంగా వేగవంతంగా పర్యాటకులు టికెట్స్ పొందవచ్చన్నారు. స్థానిక లాంచీస్టేషన్ వద్ద సెల్‌ఫోన్ ద్వారా బార్కోడ్ స్కాన్ చేసిన తరువాత పర్యాటకుల కొండ ప్రవేశం జరుగుతుందని తెలిపారు. ఎనిమిది మంది సిబ్బందిని ఔట్æసోర్సింగ్ ద్వారా ఆన్లైన్ కౌంటర్ల నియమించామని చెప్పారు. నాగార్జునకొండ మ్యూజియంలో ఫ్యాన్లు, ఏసీలు పనిచేయటం లేదని విలేకర్లు ప్రశ్నించగా కొండపైనున్న ట్రాన్స్ఫార్మర్పై అధిక లోడు పడుతుండటంతో విద్యుత్ సమస్య వస్తుందన్నారు. మరో ట్రాన్స్ఫార్మర్కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా కొండపైనున్న మ్యూజియంకు వెళ్లి పనులను పర్యవేక్షించాలన్నారు. దేశంలోని అన్ని మ్యూజియంలలో క్యూరేటర్ సమస్య ఉందని, అందుబాటులో ఉన్న సిబ్బందితోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దీనికి ముందు ఆయన కొండను, మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ దేవేంద్రనాథ్ బోయి, సర్వేయర్ ప్రశాంత్, సీఏ డాకారెడ్డి, అసిస్టెంట్ సీఏ వెంకటయ్య, మ్యూజియం ఇన్చార్జి బసవ గోపాలరత్నం, మ్యూజియం సిబ్బంది ఉన్నారు. -
నాగార్జునకొండపై అమెరికన్ల సందడి
విజయపురి సౌత్: నాగార్జునకొండను సోమవారం అమెరికా దేశానికి చెందిన ఐదుగురు సందర్శించారు. వీరు కొండపై నెలకొల్పిన మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలో రాతిబండలపై చెక్కిన కళారూపాలను ఆసక్తిగా వీక్షించారు. తరువాత పునర్నిర్మిత మహాస్థూపం, స్నానఘట్టం, అశ్వమేధ యజ్ఞశాలను తిలకించారు. సాగర్‌కు చేరుకొని అనుపు, ఎత్తిపోతల జలపాతాలను వీక్షించారు. -
నాగార్జునకొండలో మయన్మార్ బౌద్ధులు
విజయపురి సౌత్: నాగార్జునకొండను గురువారం మయన్మార్ దేశానికి చెందిన 8 మంది బౌద్ధుల బృందం సందర్శించింది. వీరు కొండపై నెలకొల్పిన మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలో రాతిబండలపై చెక్కిన వివిధ కళారూపాలను వీక్షించారు. కొండపై దలైలామా నాటిన బోధిమొక్క వద్ద ప్రార్థన చేశారు. తరువాత పునర్నిర్మిత మహా స్థూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను సందర్శించారు. అనంతరం సాగర్ చేరుకొని అనుపు, ఎత్తిపోతల జలపాతాలను వీక్షించారు. -
నాగార్జునకొండకు తెలంగాణ లాంచీ
విజయపురిసౌత్ (మాచర్ల): తెలంగాణా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, విద్యుత్శాఖామాత్యులు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి బుధవారం నాగార్జునసాగర్‌కు రానున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో లాంచీస్టేషన్ ప్రారంభంతోపాటు నూతనంగా నిర్మించిన లాంచీని జలాశయంలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎల్పి నేత కుందూరుజానారెడ్డి, నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తాసుఖేందర్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు.