నాగార్జునకొండపై అమెరికన్ల సందడి
విజయపురి సౌత్: నాగార్జునకొండను సోమవారం అమెరికా దేశానికి చెందిన ఐదుగురు సందర్శించారు. వీరు కొండపై నెలకొల్పిన మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలో రాతిబండలపై చెక్కిన కళారూపాలను ఆసక్తిగా వీక్షించారు. తరువాత పునర్నిర్మిత మహాస్థూపం, స్నానఘట్టం, అశ్వమేధ యజ్ఞశాలను తిలకించారు. సాగర్‌కు చేరుకొని అనుపు, ఎత్తిపోతల జలపాతాలను వీక్షించారు.