అమెరికాలో మోదీకి అరుదైన గౌరవం
వాషింగ్టన్: జూన్ 8న యూఎస్ కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసగించడానికి వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అమెరికా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరచి అత్యంత అరుదుగా ఇచ్చే స్పీకర్ విందుకు ఆహ్వానించనుంది. కాంగ్రెస్ ను ఉద్దేశించి మోదీ ఇచ్చే ప్రసంగంలో అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ తో పాటు కేబినెట్ మంత్రులు హాజరుకానున్నారు.
ఇందుకోసం అధ్యక్షుడు బరాక్ ఒబామా, సెనేటర్లు మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 8న జరిగే ఈ కార్యక్రమంతో పాటు పలు ఈవెంట్లతో మోదీ బిజీగా గడపనున్నారు. మొదట స్పీకర్ ఇచ్చే విందుకు మోదీ హాజరవుతారు. తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గతంలో మన్మోహన్ సింగ్, అటల్ బిహారి వాజ్ పేయి, పీవీ నరసింహారావులు మాత్రమే కాంగ్రెస్ జాయింట్ మీటింగ్ లో సభను ఉద్దేశించి ప్రసగించారు.