టెహ్రాన్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ నేడు ఇరాన్ వెళ్లనున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, మౌలికవసతులు, ఇంధన రంగం, ఉగ్రవాదంపై ఆ దేశాధ్యక్షుడితో చర్చిస్తారు. ఇరాన్‌లోని చబహర్ పోర్టు అభివృద్ధికి భారత సహకారం నేపథ్యంలో రెండు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఈ పోర్టులో రెండు టెర్మినల్స్, ఐదు మల్టీ కార్గో బెర్త్‌ల అభివృద్ధిలో భారతీయ పోర్టు ట్రస్టులు భాగస్వామ్యం కానున్నాయి.టెహ్రాన్‌లో దిగగానే మోదీ నేరుగా స్థానిక గురుద్వారాను సందర్శిస్తారు. అక్కడ భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.
మోదీకి అమెరికాలో అరుదైన గౌరవం
వచ్చే నెల 8న అమెరికా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీకి అపూర్వమైన రెడ్‌కార్పెట్ స్వాగతం లభించనుంది. ఆయన యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంచనున్నారు. తద్వారా ఈ ఏడాది ఆ సభలో ప్రసంగించే తొలి విదేశీ నేత మోదీనే అవుతారు.
నేడు ఇరాన్‌కు మోదీ
Published Sun, May 22 2016 1:02 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement