నాగార్జునసాగర్: బౌద్ధం పరిఢవిల్లిన నాగార్జునకొండకు శనివారం నుంచి లాంచీలు మొదలయ్యాయి. తెలంగాణ నుంచి 60 మంది పర్యా టకులతో మొదటి లాంచీ నాగార్జునకొండకు వెళ్లింది. 28 నెలల తర్వాత లాంచీలు వెళ్లడం తో నాగార్జునకొండను చూడాలని పర్యాటకు లు తహతహలాడారు. కొండకు లాంచీలు లేని సమయంలో ట్రిప్పులు వేసేవారు. ఇప్పుడు నాగార్జునకొండకు చేరుకోవాలంటే నీటిలో గంటసేపు లాంచీ ప్రయాణం చేయాల్సి ఉంది.
అక్కడ గంటసేపు మ్యూజియం తదితర ప్రాం తాలను సందర్శించే వీలుంటుంది. కొండకు లాంచీలు నడుస్తుండటంతో విదేశీ బౌద్ధమత యాత్రికుల రాకపోకలు కొనసాగనున్నాయి. ఇప్పుడు నాగార్జునసాగర్‌కు వస్తే బౌద్ధస్తూ పం కలిగిన శ్రీపర్వతారామం, బుద్ధవనం సం దర్శించే వీలు కలుగుతుంది. త్వరలో బుద్ధవనాన్ని సీఎం ప్రారంభించే అవకాశాలున్నా యని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment