నాగార్జునకొండకు ఈ–టికెటింగ్ ప్రారంభం
నాగార్జునకొండకు ఈ–టికెటింగ్ ప్రారంభం
Published Mon, Nov 7 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
విజయపురి సౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను సందర్శించే పర్యాటకులు ఈ– టిక్కెటింగ్ పొందేందుకు స్థానిక లాంచీస్టేషన్‌లో సోమవారం కౌంటర్‌ను హైదరాబాద్ సర్కిల్ డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ అనీల్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని అన్ని మ్యూజియమ్స్ సందర్శించేందుకు ఈ కౌంటర్ ద్వారా సులభతరంగా వేగవంతంగా పర్యాటకులు టికెట్స్ పొందవచ్చన్నారు. స్థానిక లాంచీస్టేషన్ వద్ద సెల్‌ఫోన్ ద్వారా బార్‌కోడ్ స్కాన్ చేసిన తరువాత పర్యాటకుల కొండ ప్రవేశం జరుగుతుందని తెలిపారు. ఎనిమిది మంది సిబ్బందిని ఔట్æసోర్సింగ్ ద్వారా ఆన్‌లైన్ కౌంటర్ల నియమించామని చెప్పారు.
నాగార్జునకొండ మ్యూజియంలో ఫ్యాన్లు, ఏసీలు పనిచేయటం లేదని విలేకర్లు ప్రశ్నించగా కొండపైనున్న ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక లోడు పడుతుండటంతో విద్యుత్ సమస్య వస్తుందన్నారు. మరో ట్రాన్స్‌ఫార్మర్‌కు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా కొండపైనున్న మ్యూజియంకు వెళ్లి పనులను పర్యవేక్షించాలన్నారు. దేశంలోని అన్ని మ్యూజియంలలో క్యూరేటర్ సమస్య ఉందని, అందుబాటులో ఉన్న సిబ్బందితోనే సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. దీనికి ముందు ఆయన కొండను, మ్యూజియంను సందర్శించారు. ఆయన వెంట అసిస్టెంట్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ దేవేంద్రనాథ్ బోయి, సర్వేయర్ ప్రశాంత్, సీఏ డాకారెడ్డి, అసిస్టెంట్ సీఏ వెంకటయ్య, మ్యూజియం ఇన్‌చార్జి బసవ గోపాలరత్నం, మ్యూజియం సిబ్బంది ఉన్నారు.
Advertisement
Advertisement