ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

Apr 24 2025 1:31 AM | Updated on Apr 24 2025 1:31 AM

ఉగ్రద

ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

మంగళగిరి టౌన్‌ : పహల్‌గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా మంగళగిరిలో పలు రాజకీయ పార్టీల నాయకులు బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతులకు సంతాపం తెలియజేశారు.

మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి మంగళగిరి నగర పరిధిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, నాయకులు నివాళులర్పించారు. కొవ్వొత్తులతో సంతాపం తెలియజేశారు. పట్టణ బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పట్టణంతో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అమానుషమని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందడం విచారకరమని పేర్కొన్నారు. దాడుకు పాల్పడిన ఉగ్రవాదులపై ప్రధాని మోడీ ఉక్కుపాదం మోపుతారని అన్నారు. దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు.

కాశ్మీర్‌ అభివృద్ధిని ఆపలేరు

గుంటూరు మెడికల్‌: కాశ్మీర్‌లో అమాయక ప్రజలపై జరిగిన అమానుష దాడికి సంఘీభావంగా బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. లాడ్జి సెంటర్‌ నుంచి శంకర్‌ విలాస్‌ వరకు కొవ్వొత్తులతో ఈ ర్యాలీ సాగింది. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు మాట్లాడుతూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ అమాయక పౌరులపై జరిపిన దాడిని ఖండించారు. పార్టీ సీనియర్‌ నాయకుడు జూపూడి రంగరాజు, భీమినేని చంద్రశేఖర్‌, ఈదర శ్రీనివాసరెడ్డి, చరక కుమార్‌ గౌడ్‌, డాక్టర్‌ శనక్కాయల ఉమాశంకర్‌, నేరళ్ళ మాధవరావు, మంత్రి సుగుణ, ఏలూరి లక్ష్మీ, మేరీ సరోజినీ, బొల్లాప్రగడ శ్రీదేవి, వాణి వెంకట్‌, కోలా రేణుకాదేవి, గాయత్రి, రాజేష్‌ నాయుడు, దార అంబేడ్కర్‌, దర్శనపు శ్రీనివాస్‌, కంతేటి బ్రమ్మయ్య, బజరంగ్‌ రామకృష్ణ, దుర్గా ప్రసాద్‌, రామచంద్రరావు, తూనుగుంట్ల రాజేష్‌, మల్లాల లక్ష్మణ్‌, కామేపల్లి వెంకటేశ్వర్లు, మోతే శేషగిరి, పోతురాజు వెంకటేశ్వర్లు, తానుచింతల అనిల్‌, సాధు రామకృష్ణ, షేక్‌ బిలాల్‌, శ్రీను నాయక్‌, పద్మనాభం, రాజా అజయ్‌ కృష్ణ, షేక్‌ సాంబశివరావు, సురేష్‌ జైన్‌, కృష్ణ చైతన్య, పేరుమళ్ల పద్మనాభం, వక్కలగడ్డ తిరుమలరావు సాంబమూర్తి, నాగసాయి, కారం శెట్టి రమేష్‌, చంద్రశేఖర్‌, తాడువాయి రామకృష్ణ, సాంబయ్య, సాయి తదితరులు పాల్గొన్నారు.

మృతులకు నివాళి

ఏఎన్‌యూ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని తీవ్రంగా కలచివేసిందని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. ఉగ్రదాడిని నిరసిస్తూ ఏబీవీపీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, పరిశోధకులు పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటన కాశ్మీర్‌లోని శాంతి, సామరస్య స్ఫూర్తికి విరుద్ధమైనదని తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు ఈ దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. దాడి వెనుక ఉన్న దుష్టశక్తులు, వారికి సహకరించిన ఎంతటివారైనా సరే వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల కన్వీనర్‌ కె.గంగాధర్‌ రావు, రాష్ట్ర షోద్‌ కన్వీనర్‌ డి. రమాకాంత్‌, యూనివర్సిటీ శాఖ వైస్‌ ప్రెసిడెంట్‌ రాము, ఎస్‌ఎఫ్‌డీ కో కన్వీనర్‌ సి.హెచ్‌. శివ గణేష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గణేష్‌, విశ్వవిద్యాలయం పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ 1
1/1

ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement