Telangana BJP MLA Raja Singh Receives Threat Calls from Pakistan - Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్‌ 

Feb 21 2023 3:58 AM | Updated on Feb 21 2023 3:50 PM

Telangana: Raja Singh Receives Threat Calls from Pakistan - Sakshi

ఆబిడ్స్‌ (హైదరాబాద్‌): గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తనకు పాకిస్తాన్‌ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు ట్విట్టర్‌ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3.34 గంటలకు తన వాట్సాప్‌ ద్వారా పాకిస్థాన్‌ నుంచి ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్‌లో ఉన్న యాక్టివ్‌ స్లీపర్‌ సెల్‌ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్‌ తెలిపారు.

ప్లస్‌ 923105017464 నెంబర్‌ ద్వారా బెదిరింపు కాల్స్‌ వచ్చినట్లు రాజాసింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement