sleeper cells
-
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్
ఆబిడ్స్ (హైదరాబాద్): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తనకు పాకిస్తాన్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3.34 గంటలకు తన వాట్సాప్ ద్వారా పాకిస్థాన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి తన ఆచూకీ, కుటుంబ వివరాలు చెబుతూ... హైదరాబాద్‌లో ఉన్న యాక్టివ్ స్లీపర్ సెల్ ద్వారా చంపేస్తామని బెదిరించినట్లు రాజాసింగ్ తెలిపారు. ప్లస్ 923105017464 నెంబర్ ద్వారా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తరచూ ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
చార్మినార్-ఫలక్‌నుమా మధ్య చక్కర్లు!
సాక్షి, హైదరాబాద్: కాలిఫట్ స్థాపనే ధ్యేయమంటూ ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఆకర్షితుడైన పాతబస్తీ వాసి మహ్మద్ అబుసాని కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ప్రారంభించింది. గత నెలలో ఇతడిపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. దీనిని రీ–రిజిస్టర్ చేసిన సీసీఎస్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో కీలకాంశాలు గుర్తించడం కోసం నిందితుడిని కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు సోమ, మంగళవారాలు విచారించారు. అబుసాని బైక్‌పై చార్మినార్–ఫలక్‌నుమా మధ్య ప్రాంతాల్లో పలుమార్లు సంచరించినట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇందుకు గల కారణాలను అబుసాని నుంచి రాబట్టారు. విదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఇతగాడికి సోషల్‌మీడియా ద్వారా కొన్ని లింకులు పంపించాడు. వాటిలో స్థానికంగా లభించే దీపావళి టపాసుల మందు, హైడ్రోజన్ పెరాక్సైడ్ తదితరాలు వాడి బాంబులు తయారు చేయడం ఎలా? అనే వివరాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీటి కోసమే అబుసాని ఆయా ప్రాంతాల్లో సంచరించాడని వెలుగులోకి వచ్చింది. మరికొందరిని ఉగ్రవాద బాట పట్టించడంతో పాటు నిధుల సమీకరణకు ఇతడు ప్రయత్నాలు చేశాడని చెప్తున్నారు. హ్యాండ్లర్ సహా ఇతర ప్రాంతాల్లోని స్లీపర్ సెల్స్‌తో సంప్రదింపుల జరపడానికి ఇతను ఫేస్‌బుక్‌తో పాటు 27 ఇన్‌స్ట్ర్రాగామ్ ఐడీలు, రెండు టెలిగ్రామ్ ఐడీలు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా సోషల్‌మీడియా గ్రూపుల్లో ఉబ్జెకిస్థాన్తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అనేక మంది సభ్యులుగా ఉన్నట్లు తేలింది. అమెరికా, ఇజ్రాయిల్‌కు సంబంధించిన ఎంబసీలను టార్గెట్ చేయాలని, బాంబు పేలుళ్లకు పాల్పడటం ద్వారా భయోత్పాతం సృష్టించాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీడియోలు ఉన్నాయని సమాచారం. హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంబసీల వద్ద రెక్కీ చేసి, అనువైన దాన్ని గుర్తించాలని ఆన్లైన్ ద్వారా హ్యాండ్లర్ ఆదేశించాడు. ఓ పక్క అబుసాని ఈ ప్రయత్నాల్లో ఉండగానే హ్యాండ్లర్ నిర్వహిస్తున్న టెలిగ్రామ్ గ్రూపులో ఇటీవల మరో సందేశం వచ్చింది. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నేషనల్ క్యాపిటల్ బ్యాంక్ వద్ద పేలుడుకు సిద్ధం కావాలంటూ అందులో సూచించాడు. దీనికి తాను సిద్ధమంటూ అబుసాని అదే గ్రూపులో పోస్టు చేశాడు. బాంబుల తయారీని సూచించే లింకుల్ని ఓపెన్ చేసినట్లు పోలీసులు చెప్తున్నా ప్రయోగాలు చేశాడా? లేదా? అనే తేలాల్సి ఉందన్నారు. అబుసాని ఫోన్‌ను విశ్లేషించడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ వార్త కూడా చదవండి: కడుపులో 11.57కోట్ల కొకైన్.. -
ఐసిస్ స్లీపర్ సెల్ యువకుడి అరెస్టు
సాక్షి,హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు ఆన్లైన్ ద్వారా ఆకర్షితుడై, విదేశంలో ఉన్న హ్యాండ్లర్ ఆదేశాల మేరకు అమెరికా, ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాలపై ఉగ్రదాడులకు సిద్ధమైన ఓ స్లీపర్ సెల్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. సీసీఎస్ పోలీసుల కథనం ప్రకారం..సైదాబాద్ ప్రాంతానికి చెందిన మహ్మద్ బిన్ సులేమాన్ (19) తండ్రి చాలాకాలం యూఏఈలో ఉద్యోగం చేశారు. అక్కడే పుట్టిన సులేమాన్ కుటుంబంతో పాటు నగరానికి తిరిగి వచ్చి పహాడీషరీఫ్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. 2020లో ఇంటర్ చదువుతున్నప్పుడే ఆన్లైన్ క్లాసుల కోసం తల్లిదండ్రులిచ్చిన ఫోన్ ద్వారా సోషల్ మీడియా ఖాతాలకు అలవాటుపడి చదువును నిర్లక్ష్యం చేశాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోని వచ్చిన వీడియోల ద్వారా ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ఆన్లైన్లో ప్రసంగాలు విని.. ఆన్లైన్లో పరిచయమైన ఉజ్బెకిస్థాన్‌లో ఉన్న ఐసిస్ హ్యాండ్లర్ ఆదేశాల ప్రకారం తన ఫోన్లో ఇన్స్ట్రా గామ్, టెలిగ్రామ్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్స్‌లోని గ్రూపుల్లో ఉన్న ఉగ్రవాద సంబంధిత వీడియోల ద్వారా ప్రసంగాలు, చర్చల్లో సైతం పాల్గొన్నాడు. హ్యాండ్లర్ సూచనల మేరకు ఉగ్రదా డులు చేయడానికి సిద్ధమై, అందుకు సంబంధించిన ఆదేశాలు వచ్చే వరకు స్లీపర్ సెల్ మాదిరిగా నగరంలోనే ఉంటున్నాడు. హ్యాండ్లర్ పంపిన లింకు వీడియోల ద్వారా బాంబుల తయారీ, ఉగ్రవాద దాడులు చేయడం వంటి అంశాల్లో శిక్షణ పొందాడు. దీంతోపాటుగా నగరానికి చెందిన మరికొందరు యువకులను కూడా ఉగ్రవాదం వైపు మళ్లించడానికి ప్రయత్నాలు చేశాడు. నిఘాపెట్టిన కేంద్ర వర్గాలు.. ఇతడి వ్యవహారాన్ని గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు కొన్నాళ్లుగా సాంకేతిక నిఘా ఉంచాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, అమెరికా, ఇజ్రాయెల్ రా యబార కార్యాలయాలపై దాడులు చేస్తానంటూ ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రాం గ్రూపుల్లో పోస్టులు పెట్టా డు. దీనిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇచ్చాయి. ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు పహాడీషరీఫ్ లోని సులేమాన్ ఇంటిని కనిపెట్టి అతడిని అరెస్టు చేశారు. అతడిపై ఐటీ యాక్ట్‌తో పాటు ఐపీసీలో ని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి జ్యూడీషి యల్ రిమాండ్‌కు తరలించారు. సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు బదిలీ చేయనున్నట్లు సీసీఎస్ అధికారి వివరించారు. -
ఇందూరులో ‘తీవ్ర’ కలకలం
సాక్షి, నిజామాబాద్ అర్బన్: ‘ఉగ్ర కార్యకలాపాల’ వార్తతో ఇందూరు జిల్లా మరోమారు ఉలిక్కిపడింది. బోధన్ యువకుడి అరెస్టుతో ఒక్కసారిగా కలకలం రేగింది. జిల్లాలో గతంలోనూ ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. కరుడుగట్టిన ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్న ఘటనలూ వెలుగు చూశాయి. ఉగ్రవాదులతో పాటు స్లీపర్‌సెల్స్ జిల్లాలో ఆశ్రయం పొందినట్లు, హైదరాబాద్ బాంబు పేలుళ్లకు పాల్పడిన వారిలో కొందరికి ఇక్కడి నుంచి సహకారం లభించినట్లు గతంలో బయటపడింది. ఇక, విదేశీయులకు అక్రమంగా పాస్‌పోర్టుల మంజూరు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందనే అనేమానంతో బోధన్‌లోని రెంజల్ బేస్‌కు చెందిన ఓ యువకుడ్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకున్న వార్త వెలుగులోకి రావడం కలవరపాటుకు గురిచేసింది. అనుమానితులకు అడ్డాగా..! జిల్లాలో ఉగ్ర కదలికలు ఉన్నట్లు గతంలోనే వెలుగు చూసింది. సమస్యాత్మక ప్రాంతాలను అడ్డాగా చేసుకుని స్లీపర్‌సెల్స్ పని చేస్తున్నట్లు నిఘా వర్గాలు అప్పట్లోనే గుర్తించాయి. కరుడు గట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరిని జిల్లా పోలీసులు కాల్చి చంపారు. స్వచ్ఛంద సంస్థల పేరుతో తీవ్రవాద కార్యకలాపాలు విస్తరిస్తున్నారనే నెపంతో కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. బోధన్‌లోని మూడు ప్రాంతాలతో పాటు ఎడపల్లిలోని ఓ ప్రాంతంలో ‘అనుమానితులు’ ఎక్కువగా ఉంటారని పోలీసులే అంతర్గతంగా చెబుతారు. అలాంటి వారి విషయంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా పోలీసులకు అనేక ‘అడ్డంకులు’ ఎదురవుతున్నట్లు తెలిసింది. ఇదే నెపంతో కొన్నాళ్లుగా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు పెద్దగా దృష్టి పెట్టట్లేదని సమాచారం. కీలకమైన కొన్ని ప్రాంతాల్లో నిఘా వైఫల్యం తరచూ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారనే విషయాలు పోలీసులకు తెలియడం లేదు. పోలీసులతోపాటు ఇంటెలిజెన్స్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఘా వైఫల్యం.. విదేశీయులకు అక్రమంగా పాస్‌పోర్టుల జారీ వ్యవహారమే జిల్లాలో నిఘా వైఫల్యానికి అతిపెద్ద నిదర్శనంగా నిలిచింది. ప్రధానంగా బోధన్‌తో పాటు మరికొన్ని వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా నిద్ర పోతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా 72 మంది రోహింగ్యాలకు పాస్‌పోర్టులు ఇచ్చేందుకు ఎస్బీ పోలీసులే క్లీన్చిట్ ఇవ్వడం వారి వైఫల్యానికి, నిర్లక్ష్యానికి పెద్ద ఉదాహరణ. నకిలీ ధ్రువపత్రాలతో కొందరు విదేశీయులు బోధన్ అడ్రస్ పేరుతో పాస్‌పోర్టులు పొంది బంగ్లాదేశ్‌కు వెళ్లి పోయారు. ఇదే తరహాలో ఇద్దరు విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తూ హైదరాబాద్ విమానాశ్రయంలో దొరికి పోవడంతో ఈ తతంగం బయటపడింది. తాజాగా బోధన్‌కు చెందిన యువకుడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడనే అనుమానంతో హైదరాబాద్ నుంచి వచ్చిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకోవడం కలవరానికి గురి చేసింది. ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక అధికారులు వచ్చి తమ ‘పని’ చక్కబెడుతుంటే, ఇక్కడే ఉండే నిఘా వర్గాలు మాత్రం అనుమానాస్పద కార్యకలాపాలను మాత్రం గుర్తించలేక పోతున్నాయి. ఇప్పటికైనా నిఘా వర్గాలు మేల్కొనపోతే కష్టమేననే భావన వ్యక్తమవుతోంది. అసాంఘిక శక్తులకు అడ్డాగా.. ►కరుడు గట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరీ నిజామాబాద్‌లో తలదాచుకుంటూ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించాడు. ఇదే పని మీద జగిత్యాలకు వెళ్తుండగా, ఏప్రిల్ 6, 2000 సంవత్సరంలో నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు కలిసి మట్టుబెట్టారు. ►సారంగపూర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఓ ఉగ్రవాదిని పోలీసులు కాల్చి చంపారు. 2002లో సారంగపూర్‌లోని ఎస్టీడీ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్ హతమయ్యాడు. ►బోధన్‌లోని ఓ సైకిల్ షాప్ యజమానిని 1998లో ఆజాం ఘోరి, అతని అనుచరులు తొమ్మిది మంది కలిసి హత్య చేశారు. ఈ కేసులో ఏడుగురు అరెస్టు కాగా, మరో ఇద్దరి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఈ ఇద్దరు హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్లలో నిందితులకు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. ►నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులనే అనుమానంతో ముగ్గురిని నిజామాబాద్ కలెక్టరేట్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. ►ఇది జరిగిన కొన్నాళ్లకే నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో దేశ వ్యతిరేక నినాదాలతో కూడిన పేపర్లు ప్రత్యక్షమయ్యాయి. గాంధీజీ విగ్రహానికి నల్ల రంగు పూసిన దుండగులు.. కలెక్టరేట్ వద్ద అరెస్టు చేసిన వారిలో ఒకరిని విడుదల చేయాలంటూ పేపర్లలో రాయడం కలకలం రేపింది. -
కరావళిలో శాటిలైట్ ఫోన్ల వాడకం
బనశంకరి: కరావళిలో ఉగ్రవాద స్లీపర్‌సెల్స్ చడీచప్పుడు లేకుండా తమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి బలపడేలా నిషేధిత శాటిలైట్ ఫోన్లు పనిచేస్తున్నట్లు వెలుగుచూసింది. వీటిని ఎవరు వాడుతున్నారా అని కేంద్ర సంస్థలు ఆరా తీస్తున్నాయి. దేశంలో సాధారణ పౌరులు శాటిలైట్ ఫోన్ల వాడకంపై నిషేధం ఉంది. ఉగ్రవాద వర్గాలు ఇతర దేశాల్లో ఉండే సహచరులతో రహస్య సంభాషణలకు ఈ ఫోన్లను ఉపయోగిస్తుంటాయి. ఎక్కడెక్కడ జరిగాయి గత మూడు రోజుల క్రితం దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేళాలు, 15 రోజుల క్రితం బెళ్తంగడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిల్లూరు, కార్కళ, బజగూళి ప్రాంతాల్లో అప్పుడప్పుడు శాటిలైట్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిగాయని జాతీయ నిఘా సంస్థలు ఐబీ, రా గుర్తించాయి. కొరియా దేశ తురాయా బ్రాండ్ శాటిలైట్ ఫోన్ యాక్టివేట్ కాగా గత 6 రోజుల్లో రెండుసార్లు శాటిలైట్ ఫోన్లో మాటామంతీ జరిగాయి. దీనికి సంబంధించి అంతర్గత భద్రతా విభాగాల అధికారులు విచారణ చేపడుతున్నారు. 2019 జూన్ నుంచి ఆగస్టు మధ్యలో బెళ్తంగడి తాలూకాలోని గోవిందూరిలో ఇలాంటి సంఘటనే జరిగింది. 2008 ముంబై దాడి సమయంలో ఉగ్రవాదులు తురాయా శాటిలైట్ ఫోన్లను వినియోగించారు. ఈ దాడి తరువాత భారతదేశ వ్యాప్తంగా ఆ శాటిలైట్ ఫోన్లను నిషేధించారు. ప్రస్తుతం మళ్లీ తెరమీదకు రావడంతో నిఘా సంస్థలు విచారణ చేపట్టాయి. -
బెంగళూరు, మైసూర్లో ఉగ్రకదలిక
మైసూరు: బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ చురుగ్గా ఉన్నాయని, కర్ణాటక తీరం, బంగాళాఖాతం వెంబడి అవి తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశాయని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం పేర్కొన్నారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆ ఉగ్రవాద స్లీపర్ సెల్స్ జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందినవిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమానిస్తోందని తెలిపారు. బెంగళూరు, మైసూరుల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత జాగ్రత్త తీసుకోమని ఎన్ఐఏ సూచించిందన్నారు. కోస్టల్, ఇంటీరియర్ కర్ణాటకలోనే కాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా జేఎంబీ కార్యకలాపాలు విస్తరించిందని బొమ్మై హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్రమ బంగ్లాదేశీ వలసదారులు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఎన్ఐఏతో కలసి పనిచేస్తుందని, నవంబర్ 1 నుంచి పని చేయడం మొదలుపెడుతుందని తెలిపారు. జేఎంబీ బృందాలు తమిళనాడులోని క్రిష్ణగిరి కొండల ప్రాంతాల్లో శిక్షణ పొందాయని, అక్కడ స్థావరం ఏర్పర్చుకొని దేశవ్యాప్తంగా అలజడి సృష్టించాలని చూశాయని ఎన్ఐఏ తెలిపింది. జేఎంబీ జార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లో విస్తరించిందని న్యూఢిల్లీలో జరిగిన ఏటీఎస్ సమావేశంలో ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తన కోరలు విస్తరించాలని జేఎంబీ చూస్తోందని, ఇప్పటికే 125 మంది అనుమానితుల జాబితాను రాష్ట్రాలకు అందించామన్నారు. జేఎంబీ గ్రూప్ 2014 నుంచి 2018 మధ్య బెంగళూరులో 22 రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుందన్నారు. -
అన్నాడీఎంకే పార్టీలో స్లీపర్ సెల్స్ కలకలం
-
పంజాబ్‌పై దాడి చేయండి: ఐఎస్ఐ
న్యూఢిల్లీ: భారత్ పై దాడి చేయాలని పాకిస్థాన్‌కు చెందిన సిక్కు ఉగ్రవాదులకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల శాఖకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. పంజాబ్‌లో తమ ఆదీనంలో ఉన్న స్లీపర్ సెల్స్‌ను అప్రమత్తం చేసిన ఐఎస్ఐ.. సర్బత్ ఖల్సా నిర్వాహకులను అరెస్టు చేసిన అంశాన్ని ఆసరాగా చేసుకొని అనూహ్య దాడులు చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నెల (నవంబర్) 10న బటిండాలో సిక్కులు సర్బత్ ఖల్సా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. అయితే, దీన్ని అదనుగా చేసుకొని ఘర్షణలు, అల్లర్లు సృష్టించాలని బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు ఇప్పటికే నిఘావర్గాల సమాచారం అందడంతో ఈ కార్యక్రమానికి పోలీసులు, పంజాబ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 12మంది బబ్బార్ ఖల్సా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడినట్లు కూడా తెలియడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆదివారం పంజాబ్ పోలీసులు పెద్ద మొత్తంలో అరెస్టు చేశారు. 180మందిని తమ అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 23న అనుమానిత ఉగ్రవాది కమల్ దీప్ సింగ్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.