కరీంనగర్ రూరల్: కేసీఆర్‌కు దమ్ముంటే తన కొడు కు కేటీఆర్‌ను సీఎంగా ప్రకటించాలని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సవాల్ విసిరారు. ఆదివారం కరీంనగ ర్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనుల ప్రారంభ కార్యక్రమంలో సంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రా మపంచాయతీ కార్మికులు, వైద్యశాఖ సిబ్బందితోపాటు పలు ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు సంజయ్‌ను కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు.
ఈ సందర్భంగా ఆయ న మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ అహంకారంతో వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని దుయ్యబట్టారు. కొడుకు వైఖరి చూసే కేసీఆర్ ఆయన్ని సీఎంగా ప్రకటించడంలేదని ఎద్దేవాచేశారు. కేటీఆర్‌ను సీఎంగా ప్రకటించిన వెంటనే ఒక్క ఎమ్మె ల్యే కూడా బీఆర్‌ఎస్‌లో ఉండరని చెప్పారు. కేటీఆర్ దమ్ముంటే గోషామహల్‌లో రాజాసింగ్‌పై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు.
ఆర్టీసీకి ఉన్న లక్షకోట్ల ఆస్తులను దోచుకునేందుకే సీఎం విలీనం డ్రామా ఆ డుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం గవర్నర్ ప్రయతి్నస్తే సీఎం కేసీఆర్ గవర్నర్ వ్యవస్థను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎవరికీ అ భ్యంతరం లేదని, కమిటీలు, ఉత్తర్వుల పేరిట కాలయాపన చేసి ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రయతి్నస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment