(ఫైల్‌పోటో)
సాక్షి, హైదరాబాద్: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు మహ్మద్ ప్రవక్త మీద రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ సస్పెండ్ చేసింది. అదే సమయంలో రాజాసింగ్‌ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో సమాధానం చెప్పాలని బీజేపీ క్రమశిక్షణ కమిటీ కోరింది. దీనిపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కాగా, రాజాసింగ్ జైలులో ఉండటంతో ఆయన క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇవ్వలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజాసింగ్ భార్య.. బీజేపీ క్రమశిక్షణ కమిటీకి గురువారం మెయిల్ పంపించారు. ఈ సందర్భంగా లేఖలో సమాధానం చెప్పేందుకు మరికొంత సమయం ఇవ్వాలని రాజాసింగ్ కుటుంబ సభ్యులు కమిటీని కోరినట్టు తెలుస్తోంది. కాగా, క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన 10 రోజుల గడువు రేపటితో(శుక్రవారం) ముగియనుంది. దీంతో, రాజాసింగ్ భార్య.. ఇలా మరికొంత సమయం కావాలని కోరారు.
ఇది కూడా చదవండి: రాజాసింగ్‌ను బీజేపీ పూర్తిగా వదిలేసిందా?
Comments
Please login to add a commentAdd a comment