
సాక్షి, హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు ఇసుక మాఫియాలో మునిగి తేలుతున్నారని, జూపల్లి అండతో పాలమూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోందని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. జూపల్లి ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ప్రజలు ఫిర్యాదు చేసినా సీఎం పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సీఎం తీరు చూస్తుంటే ‘నేను ప్రగతిభవన్‌లో కూర్చుని రాష్ట్రాన్ని దోచుకుంటాను, మీరు జిల్లాలను దోచుకోండని’మంత్రులకు చెప్పినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఖనిజ సంపదను ఆంధ్రకు తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాపై చర్చించేందుకు జూపల్లి సిద్ధమా అని సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment