వనపర్తి: జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిచేయడంతో పాటు మారుమూల పల్లెలకు రోడ్లు వేస్తామని, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామని ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆ గ్రామానికి వేసినరోడ్డు, రైతు పంట పొలం, ఇంటి ముందు ఉన్న నల్లాయే తిరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా చెబుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని స త్వరం అభివృద్ధి చేసేందుకు సీఎం కం కణం కట్టుకున్నారని అన్నారు. పదవి స్వీ కరించిన అనంతరం బుధవారం వనపర్తికి వచ్చిన ఆయనకు ఘనస్వాగతం ల భించింది. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో పార్టీ శ్రేణులు ఘనంగా ఆయనను సన్మానించారు. పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ తదితరులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ.. 60 ఏళ్ల సీమాంధ్రపాలనలో జరి గిన అన్యాయాన్ని ఐదేళ్లలో పూడ్చేందుకు కృషిచేస్తామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల కష్టాలను తీర్చుతామన్నారు. వనపర్తిని జిల్లా కేంద్రంగా మార్చుతామని, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రోడ్ల విస్తరణను సత్వరం చేస్తామన్నారు. ప్రజాసేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ల పాటు పనిచేసిన నిరంజన్‌రెడ్డికి సీఎం కీలకపదవి ఇచ్చారని చెప్పారు.
ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ.. నిరంజన్‌రెడ్డి ఆలోచన విధానం, ఆ యన చిత్తశుద్ధి తనకెంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. మాజీమంత్రి వై.ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణమ్మ మాట్లాడుతూ.. జిల్లాలో కరువు, వలసలను అరికట్టేం దుకు అధికనిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో నాయకులు పు రుషోత్తంరెడ్డి, బి.లక్ష్మయ్య, జగదీశ్వర్‌రె డ్డి, బుచ్చారెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, ఖిల్లాఘనపురం ఎంపీపీ కృష్ణనాయక్, పెద్దమందడి జెడ్పీటీసీ సభ్యులు వేణుగోపాల్ వనపర్తి కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇంటింటికీ తాగునీరు
Published Thu, Dec 25 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM
Advertisement
Advertisement