వనపర్తి రూరల్: కస్తూర్బాలో మొక్కలు నాటుతున్న నిరంజన్‌రెడ్డి తదితరులు
– ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి
వనపర్తి రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకం రానున్న డిసెంబర్ నాటికి ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మర్రికుంట కస్తూర్బా పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. పాఠశాలలో సమస్యలను తెలపాలని విద్యార్థులను నిరంజన్‌రెడ్డి కోరగా నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పడంతో ఆయన పైవిధంగా మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, నాయకులు లోక్‌నాథ్‌రెడ్డి, శ్రీధర్, కృష్ణ, రాము, యోగానందరెడ్డి, సంపత్‌కుమార్‌రెడ్డి, కురుమూర్తి, నాగవరం, శ్రీనివాసపురం ఉపసర్పంచ్‌లు మధుసూదర్‌రెడ్డి, జనార ్దన్ తదితరులు పాల్గొన్నారు.