every home
-
ఢిల్లీ బడ్జెట్: మహిళలకు కేజ్రీవాల్ మరో కానుక
దేశరాజధాని ఢ్లిలీలో ఉంటున్న మహిళలు ఇకపై ప్రతీనెలా రూ. 1,000 అందుకోకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా పలు కీలక ప్రకటనలు చేశారు. ఢిల్లీలో ఉంటున్న 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం ప్రతి నెలా రూ.1000 అందజేస్తుందని అతిషి ప్రకటించారు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ఈ మొత్తాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా ‘అరవింద్ కేజ్రీవాల్ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. #WATCH | Delhi Finance Minister Atishi reaches the Vidhan Sabha ahead of the Budget presentation. pic.twitter.com/73fBsKG9a9 — ANI (@ANI) March 4, 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అతిషి మర్లెనా మాట్లాడుతూ.. ‘రామరాజ్యంలో తదుపరి అడుగు మహిళల భద్రత. మహిళల అవసరాలను తీర్చడంలో ముందున్నందుకు గర్వపడుతున్నాం. ఉచిత విద్యుత్తు, నీటి బిల్లులు, మొహల్లా క్లినిక్, వృద్ధ మహిళలను తీర్థయాత్రలకు పంపడం మొదలైనవి చేపట్టాం. 2014తో 2024ను పోల్చినప్పుడు మహిళలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించాం’ అని అన్నారు. #DelhiBudget | "In 2014, the per capita income of Delhi was Rs 2.47 lakhs and today the per capita income of Delhi has reached 4.62 lakhs which is two and a half times more than the national average...Today, I am going to present a budget of Rs 76,000 crores," says Delhi Finance… pic.twitter.com/RMjQlA9EMA — The Times Of India (@timesofindia) March 4, 2024 ఈ బడ్జెట్లో విద్యా రంగానికి రూ.16,396 కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి అతిషి ప్రతిపాదించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అతిషి అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 9 లక్షల మంది బాలికలు చదువుతున్నారని, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 933 మంది బాలికలు నీట్లో ఉత్తీర్ణత సాధించగా, 123 మంది బాలికలు జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని ఆమె తెలిపారు. -
ఇంటింటికీ వ్యవసాయ పథకాలు
అనంతపురం టౌన్: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలను గ్రామాల్లోని ప్రతి ఇంటికీ చేర్చే బాధ్యత మహిళా సంఘాలు తీసుకోవాలని వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ పేర్కొన్నారు. శనివారం ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో ‘వ్యవసాయాభివృద్ధి–మహిళా సంఘాల పాత్ర’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వాటిని తెలుగు భాషలో మహిళా సమాఖ్యలకు పంపుతామన్నారు. వీటిపై గ్రామ, మండల సమాఖ్య సమావేశాల్లో చర్చించి రైతులకు సమాచారం అందించాలన్నారు. ‘మన విత్తన కేంద్రం’ ద్వారా విత్తన సేకరణ మహిళా సంఘాలు చేపట్టాలన్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో జరుగుతున్నాయని, జిల్లా వ్యాప్తంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వేరుశనగ పంటకు ప్రత్యామ్నాయంగా నవధాన్యాల సాగు, ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.లక్ష లోపు రుణాలను బ్యాంకర్లు ఇవ్వాలని, దీనిపై రైతులకు సరైన అవగాహన లేదన్నారు. రుణ అర్హత కార్డులు, వ్యవసాయ సాగు ధ్రువీకరణపత్రాల్లో ఏదో ఒకటి బ్యాంకుకు ఇస్తే రుణాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలు తదితర వస్తువులు లభించే ‘వన్ స్టాప్ షాప్’ను నిర్వహించేందుకు మహిళా సంఘాలు ముందుకు రావాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ మహిళా సంఘాలపై నమ్మకంతో ఈ–క్రాప్ నమోదును అప్పగిస్తే అద్భుతంగా చేశారన్నారు. వ్యవసాయ అధికారులు మండల స్థాయి సమావేశాలకు వెళ్లి తమ శాఖలో అమలవుతున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జేసీ–2 వెంకటేశం, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు, పీఎం నరసయ్య, డీపీఎం రామ్మోహన్, వ్యవసాయశాఖ జేడీ శ్రీరామమూర్తి, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రామసుబ్బమ్మ, సభ్యులు, వ్యవసాయ, డీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. -
డిసెంబర్ నాటికి ఇంటింటికి తాగునీరు
– ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వనపర్తి రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పథకం రానున్న డిసెంబర్ నాటికి ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని మర్రికుంట కస్తూర్బా పాఠశాలలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. పాఠశాలలో సమస్యలను తెలపాలని విద్యార్థులను నిరంజన్‌రెడ్డి కోరగా నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పడంతో ఆయన పైవిధంగా మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ శంకర్‌నాయక్, నాయకులు లోక్‌నాథ్‌రెడ్డి, శ్రీధర్, కృష్ణ, రాము, యోగానందరెడ్డి, సంపత్‌కుమార్‌రెడ్డి, కురుమూర్తి, నాగవరం, శ్రీనివాసపురం ఉపసర్పంచ్లు మధుసూదర్‌రెడ్డి, జనార ్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ శుద్ధజలం
– కష్ణానది నుంచి నీళ్లు పొందే మొదటి హక్కు పాలమూరుకే – నాగం.. చిల్లర మాటలు మానుకోండి – మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి బొంరాస్‌పేట : మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామని మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. శనివారం బొంరాస్‌పేట మండలంలో పర్యటించిన ఆయన చెట్టుపల్లితండాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కష్ణానది నుంచి నీళ్లు పొందే మొదటి హక్కు పాలమూరుకే ఉందన్నారు. జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టులతోపాటు 45–50 చెరువులను నింపి సాగునీరందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ దష్టిలో ఉందన్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ నుంచి 1.08లక్షల ఎరకాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రతి ఇంటికి శుద్ధమైన (ఫిల్టర్ వాటర్) తాగునీటి నల్లా ఏర్పాటు చేయిస్తామన్నారు. అనంతరం చిల్మల్‌మైలారంలో ఆర్ఓ ప్లాంట్‌ను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు వల్లే అన్ని రోగాలను నివారించవచ్చన్నారు. ‘ఆసరా పథకం కింద పింఛను రూ.వేయి, కల్యాణలక్ష్మి తదితర సంక్షేమ పథకాలన్నీ వథానా..? అంటూ ఎంపీ జితేందర్రెడ్డిప్రశ్నించారు. అభివద్ధి చేసి చూపే టీఆర్ఎస్ను వేలు ఎత్తిచూపే అర్హత బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డికి లేదని మండిపడ్డారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గౌరారం, చెట్టుపల్లితండాలోని కేజీబీవీ, చిల్మల్‌మైలారంలో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితోపాటు సినీ యువ హీరోలు, నటులు రాజా (ఆనందం), నాగశౌర్య (ఒక మనసు), అభిజిత్ (కేటుగాడు), ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి (బందూక్), తేజస్ (ఉలువ చారు ఆవకాయ బిర్యానీ) మొక్కలు నాటారు. నటులతోపాటు స్థానికులు మొక్కలు నాటుతూ సెల్ఫీలు దిగారు. ఇందులో టీఆర్ఎస్ మండల నాయకులు మల్కిరెడ్డి, ముద్దప్ప దేశ్‌ముఖ్, వెంకట్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సీసీ వెంకటయ్యగౌడ్, తహసీల్దార్ వెంకటయ్య, ఎంఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్
20 లక్షల మందికి సర్కారు కానుక అక్టోబర్ 1 నుంచి ఆహార భద్రతా చట్టం అమలు: ఈటల సాక్షి, హైదరాబాద్: కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ఆడపడుచులందరికీ వంట గ్యాస్ కనెక్షన్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కానుక ఇవ్వబోతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. శనివారం జాయింట్ కలెక్టర్లు, డీఎస్వోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో గ్యాస్ కనెక్షన్ల పంపిణీని ప్రారంభించామని.. త్వరలో మిగతా జిల్లాల్లోనూ ప్రారంభించి, నాలుగు నెలల్లోగా అందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. ఈ 20 లక్షల గ్యాస్ కనెక్షన్లలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్పీ) కింద కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కనెక్షన్లు అందజేయనుందని... మిగతా 10 లక్షల కనెక్షన్లకు అయ్యే రూ.150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుందని వెల్లడించారు. రాష్ట్రంలోని కుటుంబాలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం అందించే పాఠశాలలు, అంగన్వాడీ కేం ద్రాలకు కూడా గ్యాస్ కనెక్షన్లు అందజేస్తామన్నారు. 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి ఈటల తెలిపారు. ఆయా కుటుంబాలకు ఇచ్చే రేషన్‌కార్డు ధరను రూ.5గా నిర్ణయించామన్నారు. అలాగే రాష్ట్రంలో ఆహార భద్రత చట్టాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు. రేషన్ దుకాణాల స్థాయిలో అక్రమాలను నియంత్రించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని.. అవకతవకలను అరికట్టడం ద్వారా సుమారు రూ.400 కోట్లు ఆదా చేశామని పేర్కొన్నారు. -
ఐదేళ్లలో ఇంటికో డ్రోన్!
వాషింగ్టన్: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ లేని ఇళ్లు లేవంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో కనీసం ఎవరో ఒకరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అంతగా అవి మన జీవితంలో భాగమైపోయాయి. ఈ ఫోన్లు నిత్యావసర వస్తువుల జాబితాలో చేరిపోయాయి. అయితే త్వరలో వీటి స్థానాన్ని డ్రోన్లు భర్తీ చేస్తాయట. త్వరలో ఇంటికో డ్రోన్ తప్పనిసరి అవసరంగా మారుతుందని భారత సంతతికి చెందిన నాసా పరిశోధకుడు పరిమల్ కోపడేకర్ అంటున్నాడు. నాసా ఆధ్వర్యంలో సిలికాన్ వ్యాలీలో ఇటీవల జరిగిన మానవ రహిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఐదు నుంచి పది సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో ఓ డ్రోన్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. మన ఇంటి పైకప్పును పరిశీలించేందుకు, ఏదైనా పని చేసే సమయంలో ఓ చిన్న స్క్రూడ్రైవర్‌ను తీసుకొచ్చేందుకు.. ఇలా అనేక పనులకు ఇళ్లల్లో డ్రోన్లను వినియోగిస్తారు. ఈ మార్పు ఐదు నుంచి పదేళ్లలోనే జరుగుతుంది అని పరిమల్ అన్నాడు. ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తున్న డ్రోన్లను శాస్త్రవేత్తలు మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనేక ఉత్పత్తుల డెలివరీ, నిర్మాణాల తనిఖీ, భద్రత, రక్షణ, వ్యవసాయ పనుల పర్యవేక్షణ తదితర పనులకు కూడా పనికొచ్చేలా డ్రోన్లను తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ జామ్లలాగా ఆకాశంలో కూడా డ్రోన్లతో జామ్‌లు ఏర్పడే పరిస్థితి ఉత్పన్నం కావొచ్చని ఆయన తెలిపారు. ఈ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే వ్యవస్థను అభివృద్ది చేసేందుకు గూగుల్, ఆమెజాన్, సిస్కో, రేథియాన్, డ్రోన్ డిప్లాయ్, మ్యాటర్నెట్ తదితర సంస్థలతో నాసా పనిచేస్తోంది. -
హస్నాబాద్‌లో ఇంటింటికొక సైనికుడు
-
ప్రతి ఇంటికీ మంచినీరివ్వాలి
బుచ్చిరెడ్డిపాళెం : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి ఇంటికీ మంచినీరివ్వాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పంచేడులో బుధవారం జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి తాగునీరివ్వాలని చూస్తున్నారని, అలా కాకుండా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో అక్కడి సీఎం కేసీఆర్ దీని పై సర్వే జరుపుతున్నారని వివరించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, నీటిబొట్టు దొరకని మెట్ట ప్రాంతాలెన్నో ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఫ్లోరైడ్ బారినపడి వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కృష్ణా, తుంగభద్ర, వంశధార, గోదావరి, పెన్నా, తదితర నదుల నుంచి తాగునీటిని ప్రతి ఇంటికీ వెళ్లేలా చూడాలని కోరారు. 2015 నాటికి పాఠశాలలన్నింటిలో మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. 2019 నాటికి రూ.2 లక్షల కోట్లతో 13 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాలన్నదే ప్రధానమంత్రి మోడీ లక్ష్యమని తెలిపారు. అందరూ చదువుకోవాలని, మేధోవంతులై దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయాలని కాంక్షించారు. అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి అర్హుల పింఛన్లను తొలగించారని, వారిని గుర్తించి తిరిగి ఇప్పించాల్సిందిగా ఎంపీ మేక పాటి రాజమోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టీడీపీ హయాంలో రూ.75 ఉన్న పింఛన్‌ను రూ.200 చేసిన ఘనత దివంగత సీఎం వైఎస్సార్‌దేనని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కన్నీటి గాధలను కళ్లారా చూసి వైఎస్సార్ చలించిపోయారన్నారు. ఈ కారణంగానే పింఛన్‌ను రూ.200కు పెంచి వారిని ఆదుకున్న మహానుభావుడు వైఎస్సార్ అన్నారు. చంద్రబాబునాయుడు తన ఆశయాలను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ఫలితం ఉంటుందన్నారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేశారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా మరుగుదొడ్డికి కేటాయించిన రూ.12 వేలు చాలడం లేదన్న విషయం తెలిసిందన్నారు. అందుకే ఎంపీ మేకపాటి ఆ మొత్తాన్ని రూ.14 వేలకు పెంచాల్సిందిగా లేఖ ద్వారా ప్రధానిని కోరారన్నారు. వసతిగృహాల్లో కూడా పరిశుభ్రతపై దృష్టి సారించి రూ.పది లక్షలను కేటాయించామన్నారు. డ్రెయి న్లు, వసతిగృహంలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తున్నామన్నారు. ట్యూ టర్లను నియమించి విద్యార్థులను తీర్చిదిద్దనున్నట్లు తెలి పారు. వవ్వేరు బ్యాంక్ చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ రొండ్ల జయరామయ్య, సర్పంచ్ రమణమ్మ, నోడల్ ఆఫీసర్ విజయలక్ష్మి, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, తహశీల్దార్ రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.