
మద్దూరు: మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు మండలంలోని నందిగామలో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అనుచరులు, ఇతర టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మండలంలోని మన్నాపూర్‌లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి మంత్రులు గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించేందుకు వెళ్లగా రేవంత్ తన అనుచరులతో కొత్తపల్లి మీదుగా నందిగామ వెళ్లారు. అక్కడ మంత్రులు రాకముందే శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు యత్నించారు.
కొద్దిసేపు ఆగిన ఎమ్మెల్యే ఆ వెంటనే శిలాఫలకం ఎదుట కొబ్బరికాయ కొట్టారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరగగా శిలాఫలకం ధ్వంసమైంది. ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుల వాహన శ్రేణిని టీఆర్‌ఎస్ నేతలు, గ్రామస్తులు అడ్డగించారు. దీంతో ఎమ్మెల్యే వాహనం దిగి నడుచుకుంటూ తిమ్మారెడ్డిపల్లి గేటు వరకు వెళ్లి అక్కడి నుంచి బైక్‌పై కొడంగల్ వెళ్లిపోయారు. ఆ తర్వాత పలువురు కాంగ్రెస్ నాయకులు, వాహనాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోయిల్‌కొండ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం నాయకులకు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న జూపల్లి, పట్నం మహేందర్‌రెడ్డిలు రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గజ్వేల్ నుంచే ముఖ్యమంత్రి పతనం
కొడంగల్: తెలంగాణలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, సీఎం పతనం గజ్వేల్ నుంచే ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.