సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ , జూపల్లి కృష్ణారావు భేటీ ముగిసింది. వీరిద్దరితోపాటు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు గుర్నాథ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సిరెడ్డి, ముఖ్య నాయకులు పిడమర్తి రవి, కూచుకుల్ల రాజేష్ రెడ్డి కూడా ఉన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో అరగంటకు పైగా సమావేశం సాగింది.
ఈ సందర్భంగా జూలై 2న ఖమ్మం సభకు రావాలని రాహుల్‌ను పొంగులేటి, జూపల్లి కోరారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. టీ కాంగ్రెస్‌లో ఘర్ వాపసి జరుగుతోందని.. నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావడం ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కాగా తెలంగాణలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, సీనియర్ నేతలు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు నేడు(సోమవారం) రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరునున్నారు. ఇందులో భాగంగానే వీరు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే.
ఇక, ఢిల్లీలో ఉన్న వీరిద్దరూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పొంగులేటి, జూపల్లి ఉన్నట్టు సమాచారం. అనంతరం, మధ్యాహ్నం రెండు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీతో వీరు సమావేశం కానున్నారు. పొంగులేటి, జూపల్లితో పాటు అరికెల నర్సారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సహా పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరంతా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కానున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లికి పయనమయ్యారు.
ఈ సందర్బంగా మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. పొంగులేటిని బీఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కాంగ్రెస్‌లో చేరడం లేదు. ప్రజల అభిప్రాయం మేరకే కాంగ్రెస్‌లో చేరుతున్నారు. వారు మధ్యాహ్నం రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరుతారు అని తెలిపారు.
ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్ బిగ్ ప్లాన్.. 500 వాహనాల కాన్వాయ్‌తో కేసీఆర్..
Comments
Please login to add a commentAdd a comment