
మా జిల్లాలో రేవంత్ చెడబుట్టారు: టీఆర్ఎస్
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తమ జిల్లాలో తప్పబుట్టారని, జిల్లా పరువును తీస్తున్నారని జూపల్లి, లక్ష్మారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి లాంటివాళ్లు శాసనసభకే కళంకమని మండిపడ్డారు.
చంద్రబాబు కీ ఇస్తే ఈయన బొమ్మలా ఆడుతున్నారని విమర్శించారు. అవినీతిని చట్టబద్ధం చేసిన చరిత్ర చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఓబులేసు అని కూడా జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి విమర్శించారు.